Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్‌రావు లీగల్ నోటీసు
Ravinder Rao | తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్‌రావు తరఫున లీగల్ నోటీసు జారీ చేశారు.
- అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలకు సిద్ధం
- వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Ravinder Rao | తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్‌రావు తరఫున లీగల్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 16న శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి తన పేరును ప్రస్తావిస్తూ.. సిరిసిల్లలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తంలో భూమిని తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, ఎలాంటి వాస్తవ ఆధారాలు లేనివని కొండూరి రవీందర్‌రావు తరఫున జారీ చేసిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా సహకార రంగంలో పనిచేస్తూ వివిధ సహకార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన తనకు ఉన్న వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టను అసెంబ్లీ వేదికగా చేసిన ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీశాయని నోటీసులో తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి కరీంనగర్ డీసీసీబీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టీఎస్‌సీఏబీ), నాఫ్స్‌కాబ్ వరకు పలు బాధ్యతలను నిర్వహించినట్లు వివరించారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
ముఖ్యమంత్రి వంటి అత్యున్నత ప్రజాపదవిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసే ముందు.. అందుకు సంబంధించిన వాస్తవాలను పూర్తిగా ధ్రువీకరించాల్సిన బాధ్యత ఉందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు టెలివిజన్, ప్రింట్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కావడంతో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లిందని కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. లీగల్ నోటీసు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని కొండూరి రవీందర్‌రావు తరఫున పలు డిమాండ్లు చేశారు. 16.09.2026న అసెంబ్లీలో చేసిన ఆరోపణలను బేషరతుగా ఉపసంహరించుకోవడంతోపాటు.. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవ ఆధారాలు లేకుండా భవిష్యత్తులో కొండూరి రవీందర్‌రావుపై అవినీతి, అక్రమం, ఇతర తప్పిదాలకు సంబంధించిన ఆరోపణలు చేయొద్దని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు
- ●Tirumala Brahmotsavam | ముత్యాల పందిరిలో.. బాలకృష్ణుడి లీలా వినోదం
- ●Mahesh Kumar Goud | కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరగాలి: మహేశ్‌కుమార్ గౌడ్
- ●భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !
- ●Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
- ●Sreeleela | సినిమాలు లేకపోయినా సంపాదనలో శ్రీలీల తగ్గేదేలే

CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు

Tirumala Brahmotsavam | ముత్యాల పందిరిలో.. బాలకృష్ణుడి లీలా వినోదం

Mahesh Kumar Goud | కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరగాలి: మహేశ్‌కుమార్ గౌడ్

భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !



