త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sun Transit 2026 | క‌న్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్‌లో పురోగతి..!

Sun Transit 2026 | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడి సంచారం వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని పండితులు పేర్కొంటున్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు అన్ని రాశులపై దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు తనకు అనుకూలమైన రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయ‌ని విశ్వాసం.

P

Horoscope | Published On Sep 18, 2026, 6.32 am IST

Sun Transit 2026 | క‌న్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్‌లో పురోగతి..!
Advertisement

Sun Transit 2026 | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడి సంచారం వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని పండితులు పేర్కొంటున్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు అన్ని రాశులపై దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు తనకు అనుకూలమైన రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయ‌ని విశ్వాసం. ఈ క్రమంలో సూర్యుడు గురువారం కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో బుధుడు కన్యా రాశిలోనే ఉన్నాడు. సూర్యుడు, బుధుడు మిత్ర గ్రహాలుగా పేర్కొంటారు. ఈ గ్ర‌హాల కలయిక కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు క‌లుగ‌నున్నాయి. ఉద్యోగం, పెట్టుబడులు, కెరీర్‌ తదితర అంశాల్లో ప్రయోజనాలు చేకూరడంతో పాటు జీవితంలోని ఇతర రంగాల్లోనూ సానుకూల మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. ఈ సూర్య సంచారం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్న రాశులు ఏవో తెలుసుకుందాం రండి..!

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కోరుకున్న ప్రయోజనాలు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంటితో పాటు సమాజంలోనూ గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. కెరీర్‌కు సంబంధించి కొంతకాలంగా ఆందోళన చెందుతున్న వారికి ఈ సమయంలో ముఖ్యమైన, సానుకూల సమాచారం అందుతుంది. ఈ సమయంలో మిథున రాశి వారి మాటతీరు ఆకట్టుకునేలా ఉండటంతో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. తమ ప్రతిభ, కళాత్మక నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకోగలరు. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభించే సూచ‌న‌లున్నాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలనా రంగంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు దక్కవచ్చు. ప‌నిచేసే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్ప‌డుతాయి. అదనపు ఆదాయం కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కొత్త బాధ్యతలు కూడా అందుకుంటారు. ఈ సమయంలో అదృష్టం కూడా కలిసివచ్చే సూచనలు గోచ‌రిస్తున్నాయి.

కన్యా రాశి

సూర్యుడి సంచారం కన్యా రాశిలోనే జరగడంతో ఈ రాశి వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలు క‌లిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదృష్టం పెరిగే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా కోరుకుంటున్న ప్రాంతానికి బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అనుకూల ఫ‌లితాలుంటాయి. అదృష్టం అనుకూలంగా ఉండటంతో పెండింగ్‌లో ఉన్న పలు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు కనిపించవచ్చు. కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు రావడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనితీరు, కష్టపడి పనిచేసే విధానం ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు లభించే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. చదువులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విద్యా రంగంలో చేస్తున్న కృషికి సానుకూల ఫలితాలు దక్కవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే తెలివైన నిర్ణయాలు మంచి ప్రయోజనాలను ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదివే వారికి మంచి ఫలితాలు లభించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Read Also :

Navpancham Rajyogam | నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ ప‌నుల‌కు మోక్షం..!

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్‌ చేసుకోండి..!

Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

Advertisement
Advertisement