MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
MP Chamala | బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రాకుండా మాక్ అసెంబ్లీ పెట్టి నాటకాలు వేస్తున్నారు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదని ఈ కొత్త నాటకానికి తెర తీశారు.. వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
MP Chamala | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రాకుండా మాక్ అసెంబ్లీ పెట్టి నాటకాలు వేస్తున్నారు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదని ఈ కొత్త నాటకానికి తెర తీశారు.. వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
శాసనసభా పక్ష సమావేశంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గొడవలు సృష్టించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసి పంపారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకు గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గానీ సభకు వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎంపీ చామల స్పష్టం చేశారు. నల్ల టీషర్టులపై పేర్లు రాసుకుని వస్తే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించరని ముందే ఊహించి, అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో గొడవకు దిగారని తెలిపారు. సభ లోపలికి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా బయటే ఆందోళన చేస్తూ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు దళితులను, గౌరవ స్పీకర్ పదవిని అవమానించేలా ప్రవర్తించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
సురభి నాటక మండలి సరిపోతది
సభకు ప్రత్యామ్నాయంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరుపై చామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని, మంత్రులను వ్యక్తిగతంగా దూషిస్తూ, వెకిలి చేష్టలతో కాలయాపన చేశారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఆలోచన బిఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం లేదని, అందుకే వారు సురభి నాటక మండలిలో చేరడానికి సరైన అభ్యర్థులని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు విడిచిపెట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎగతాళి చేయడం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Akbaruddin Owaisi | ఆ కంపెనీ చాలా లక్కీ.. అన్ని కాంట్రాక్టులు దానికే దొరుకుతయ్
సెప్టెంబర్ 12, 2026

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ పూర్తి
సెప్టెంబర్ 12, 2026

Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్
- ●khairatabad Ganesh | బడా గణేశ్ దర్శనానికి భారీ ఏర్పాట్లు
- ●Akbaruddin Owaisi | ఆ కంపెనీ చాలా లక్కీ.. అన్ని కాంట్రాక్టులు దానికే దొరుకుతయ్
- ●Dhee Dancer Raju Arrested | పెళ్లి పేరుతో దారుణ మోసం.. కటకటాల పాలైన 'ఢీ' డ్యాన్సర్ రాజు

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్

Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

khairatabad Ganesh | బడా గణేశ్ దర్శనానికి భారీ ఏర్పాట్లు



