Addanki Dayakar | హరీశ్ రావుపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..: అద్దంకి దయాకర్
Addanki Dayakar | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పష్టం చేశారు. తాను క్షుద్రపూజలు (Black Magic) చేయలేదని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పగలడా? అని హరీశ్ రావుని నిలదీశారు.
Addanki Dayakar | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పష్టం చేశారు. తాను క్షుద్రపూజలు (Black Magic) చేయలేదని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పగలడా? అని హరీశ్ రావుని నిలదీశారు. క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే లీగల్ నోటీసులు (Legal Notice) పంపుతున్నారని విమర్శించారు. తాము లీగల్ నోటీసులకు భయపడేవాళ్లం కాదని, కోర్టులు, రాజ్యాంగంపై నమ్మకం ఉందని చెప్పారు. లీగల్ నోటీసులకు లీగల్‌గానే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) హయాంలో తమను జైళ్లలో పెట్టినా పోరాటాలు చేశామన్నారు. హరీశ్ రావు ఎందుకు భయపడుతున్నారు?, ఆ అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించుకోవాలని చెప్పారు. గత ఏడాది శివమొగ్గకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఆఫీసులో పోలీస్ అధికారిగా చెప్పుకున్నారనే సమాచారం తమకు ఉందని వెల్లడించారు. పవిత్ర క్షేత్రాల దగ్గరే క్షుద్రశక్తుల పూజలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు.
ముక్కు నేలకు రాసి..
చాలామంది పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. క్షుద్రపూజలు లాంటి పనికిమాలిన పనులు చేసినప్పుడు మందలించాల్సింది పోయి తమను విమర్శిస్తున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హరీశ్‌రావు తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు. అఘోర కాళీ అమ్మవారిపై ప్రమాణం చేసి తాను ఎలాంటి పూజలు చేయలేదని చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ (Telangana) సమాజానికి అఘోర కాళీ దేవాలయం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒక ప్రకటన చేశానంటే అందులో చిత్తశుద్ధి ఉంటుందని తెలిపారు.
తెలంగాణ కోసం కొట్లాడా..
హరీశ్‌రావు, ఆయన మామ, బావమరిది ఇంట్లో పడుకునప్పుడు తాను తెలంగాణ కోసం కొట్లాడానని వెల్లడించారు. చిల్లరగాళ్లతో సోషల్ మీడియాలో (Social Media) ట్రోల్ చేస్తే భయపడతానా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి హరీశ్‌రావును పక్కన పెట్టారని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసునని అద్దంకి దయాకర్ అన్నారు. హరీశ్ రావు బేతాళ మాంత్రికుడిలా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ఛిద్రమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో సీఎం రేవంత్ (Revanth Reddy) ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయనకు చెడ్డపేరు రావాలని, వర్షాలు రావొద్దని హరీశ్‌రావు పిచ్చి పూజలు చేస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
సెప్టెంబర్ 20, 2026

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
సెప్టెంబర్ 20, 2026

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



