త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samuel | క‌త్తుల కోలాటం ఆడుతాం.. శాస‌న‌స‌భ‌లో మందుల సామేల్ బెదిరింపులు

Mandula Samuel | కత్తుల కోలాటం ఆడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. క‌డియం శ్రీహ‌రి ప‌ట్ల బీఆర్ఎస్ స‌భ్యుల తీరు స‌రిగా లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Mar 29, 2026, 2.51 pm IST

Mandula Samuel | క‌త్తుల కోలాటం ఆడుతాం.. శాస‌న‌స‌భ‌లో మందుల సామేల్ బెదిరింపులు
Advertisement

Mandula Samuel | త్రినేత్ర‌.న్యూస్ : కత్తుల కోలాటం ఆడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. క‌డియం శ్రీహ‌రి ప‌ట్ల బీఆర్ఎస్ స‌భ్యుల తీరు స‌రిగా లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

శాస‌న‌స‌భ‌లో మందుల సామేల్ మాట్లాడుతూ.. కేటీఆర్‌కు హ‌రీశ్‌రావుతో పొలిటిక‌ల్ ప్ర‌మాదం ఉంది.. గుర్తు పెట్టుకోండి. మీ చెల్లి ప‌ని ప‌ట్టారు.. నీ ప‌ని ప‌ట్ట‌డం ఖాయం. పోటీ ప‌డి దోచుకున్నారు రాష్ట్రాన్ని, హ‌రీశ్‌రావు ద‌గ్గ‌ర పైస‌లు ఎక్కువ ఉన్న‌య్.. ఎమ్మెల్యేలు కేటీఆర్ మాట విన‌రు. హ‌రీశ్‌రావు మాటనే వింటారు. రేపు నిన్ను ముంచేది ఖాయం. 2001 నుంచి చూస్తున్నాను అని సామేల్ పేర్కొన్నారు.

మీరు క‌డియం శ్రీహ‌రి మీద బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేశారు. క‌త్తుల కోలాటం ఆడుతాం ఖ‌బ‌డ్దార్ బిడ్డా.. మా క‌త్తులు లేచిన‌య్ అనుకో.. నీ గ‌డికి వేలాడ‌క‌డుతాం. ఎవ‌ర్నీ బెదిరిస్తున్నారు. గిరిజ‌నులు, ద‌ళితులంటే మీకు లెక్క‌లేదు. మీ గడిల్లోకి వ‌చ్చే రోజు కూడా వ‌స్త‌ది. క‌డియం శ్రీహ‌రికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వ‌రం క‌ట్టిన నాడు అదే కేసీఆర్.. ఫ‌డ్న‌వీస్, జ‌గ‌న్‌ను పిలిచారు. ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ అయిన హ‌రీశ్‌రావు పేరు లేదు.. ఊరు లేదు అని మందుల సామేల్ గుర్తు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement