త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | కాంగ్రెస్‌లోకి క‌విత‌..? హ‌స్తం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLC Kavitha | తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 6, 2026, 3.26 pm IST

MLC Kavitha | కాంగ్రెస్‌లోకి క‌విత‌..? హ‌స్తం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MLC Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారు అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. మ‌ల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నిన్న శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. ఒక వ్య‌క్తిగా బ‌య‌ట‌కు వెళ్తున్నా.. ఒక శ‌క్తిగా తిరిగి వ‌స్తాన‌ని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. త‌న‌కు బీఆర్ఎస్ పార్టీలో గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో క‌విత రాజ‌కీయ ప్ర‌యాణంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement