త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajagopal Reddy | మంత్రిని కాక‌పోతే.. ముఖ్య‌మంత్రిని అవుతా : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌విపై మ‌రోసారి పెద‌వి విప్పారు. అప్పుడో.. ఇప్పుడో.. రేపోమాపో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఊహాగానాలు వెలువడుతున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి వ‌రించ‌డం లేదు.

S

Telangana | Published On Feb 13, 2026, 9.52 pm IST

Komatireddy Rajagopal Reddy | మంత్రిని కాక‌పోతే.. ముఖ్య‌మంత్రిని అవుతా : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి
Advertisement

Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌విపై మ‌రోసారి పెద‌వి విప్పారు. అప్పుడో.. ఇప్పుడో.. రేపోమాపో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఊహాగానాలు వెలువడుతున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి వ‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి మంత్రి ప‌ద‌విపై రాజ‌గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాబోయే రోజుల్లో త‌న‌కు త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్నారు. ఒక వేళ మంత్రిని కాక‌పోతే.. ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మునుగోడు మీరు చూసుకోండి.. తెలంగాణ‌ను తాను చూసుకుంటాన‌ని నియోజ‌క‌వ‌ర్గ కేడ‌ర్‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు అడుక్కోవ‌డం రాదు.. మ‌ర్యాద‌గా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి మంత్రి ప‌ద‌వి ఇవ్వండి.. లేదంటే లాక్కునే దాకా చూసుకోకండి అని రాజ‌గోపాల్ రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement