Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
Accident | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.
- ప్రమాదం అనంతరం పరారైన లారీ డ్రైవర్
Accident | త్రినేత్ర.న్యూస్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్-వరంగల్ హైవేపై వెళ్తున్న బైకును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై శ్రావణి (17) తన తల్లిదండ్రులు ఉమ, సురేశ్‌తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తోంది. శ్రావణి ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద పడిన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలిక తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
ఆగస్టు 15, 2026

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
ఆగస్టు 15, 2026

KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు గద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్
- ●PPF | పోస్టాఫీసులోని పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, సుకన్య ఖాతాలను బ్యాంకుకు మార్చుకోవచ్చా? పూర్తి వివరాలు ఇవే..
- ●Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
- ●Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..
- ●Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ

NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్

Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్

PPF | పోస్టాఫీసులోని పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, సుకన్య ఖాతాలను బ్యాంకుకు మార్చుకోవచ్చా? పూర్తి వివరాలు ఇవే..

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం



