త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను ర‌ద్దు చేయండి.. లోకాయుక్త‌కు బీఆర్ఎస్ విన్న‌పం

BRS Party | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు లోకాయుక్తను ఆశ్రయించారు. సీఎం సోద‌రుడు కొండల్ రెడ్డి ‘టెస్సెరాక్ట్’ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల విలువైన భూముల కేటాయింపుపై లోకాయుక్త జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Aug 14, 2026, 5.14 pm IST

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను ర‌ద్దు చేయండి.. లోకాయుక్త‌కు బీఆర్ఎస్ విన్న‌పం
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు లోకాయుక్తను ఆశ్రయించారు. సీఎం సోద‌రుడు కొండల్ రెడ్డి ‘టెస్సెరాక్ట్’ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల విలువైన భూముల కేటాయింపుపై లోకాయుక్త జస్టిస్ ఏ.రాజశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ భూ కేటాయింపుల‌ను ర‌ద్దు చేసి.. సీఎం పాత్ర‌పై విచార‌ణ కోసం గ‌వ‌ర్న‌ర్‌కు పంపాల‌ని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 ఎకరాల ప్రజా భూమిని కేవలం రూ. 7 కోట్లకు ధార‌ద‌త్తం చేశారని ఆరోపించారు. ఏరోస్పేస్ కంపెనీ అని చెప్పుకుంటున్న టెస్సెరాక్ట్ చెల్లించిన మూలధనం (Paid-up Capital) కేవలం రూ. 1 లక్ష మాత్రమే. టెస్సెరాక్ట్ కంపెనీ అధికారిక బోర్డు నివేదిక ప్రకారం కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ‘సున్నా’. నివాస ఫ్లాట్ అడ్రస్‌తో నడుస్తున్న కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన డిఫెన్స్ భూములు ఎలా ఇస్తారు? యూరోపియన్ యూనియన్ ఆడిట్ సైట్ (ECA) నుంచి ఫోటోలు దొంగిలించి ప్రదర్శించారని ఆధారాలతో వెల్లడించారు.

వెబ్‌సైట్‌లో ఫేక్ నంబర్ పెట్టి కేటీఆర్ నిలదీయడంతో రాత్రికి రాత్రే మార్చేశారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా, సీఎం మేనల్లుడు నయన్ రెడ్డి సీఈవోగా ఉన్నారని లోకాయుక్త‌కు ఆధారాలు స‌మ‌ర్పించాం. భూ కేటాయింపులకు 5 నెలల ముందే సీఎం మేనల్లుడు టెస్సెరాక్ట్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు అబద్ధాలు చెబితే, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ భూ కేటాయింపులను స్వయంగా ఒప్పుకున్నారు. రికార్డుల్లో కొండల్ రెడ్డి పేరు లేకుండా బినామీలను పెట్టారు.. ఇది పక్కా బినామీ వ్యవహారం అని ఆయ‌న పేర్కొన్నారు.

కర్ణాటక ‘ముడా’ (MUDA) తరహాలోనే తెలంగాణలో టెస్సెరాక్ట్ భూ కుంభకోణం సాగింది. టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను వెంటనే నిలిపివేసి రద్దు చేయాలని లోకాయుక్తకు విన్న‌వించాం. సీఎం రేవంత్ రెడ్డి పాత్రపై విచారణ కోసం నివేదికను గవర్నర్‌కు పంపాలని డిమాండ్ చేశాం. మంత్రి శ్రీధర్ బాబు, టీజీఐఐసీ అధికారులపై అవినీతి నిరోధక చట్టం, BNS సెక్షన్ల కింద విచారణకు డిమాండ్ చేసిన‌ట్లు దాసోజు శ్ర‌వ‌ణ్ తెలిపారు.

Advertisement
Advertisement