త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | 90 రోజుల‌కో సారి డ్ర‌గ్ టెస్టు చేసుకోవాలి.. లేదంటే డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టే : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MLA Anirudh Reddy | జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తీ 90 రోజుల‌కోసారి డ్ర‌గ్ టెస్టులు చేయించుకోవాలి.. లేదంటే డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టే అని సినిమా హీరోలను ఉద్దేశించి అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Mar 31, 2026, 7.48 pm IST

MLA Anirudh Reddy | 90 రోజుల‌కో సారి డ్ర‌గ్ టెస్టు చేసుకోవాలి.. లేదంటే డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టే : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తీ 90 రోజుల‌కోసారి డ్ర‌గ్ టెస్టులు చేయించుకోవాలి.. లేదంటే డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టే అని సినిమా హీరోలను ఉద్దేశించి అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీ భ‌వ‌న్‌లో అనిరుధ్ రెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలి. బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ పరిశ్రమలోనే. స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని, డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారు. ప్రతీ 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్లే అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా. సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు.. రాజకీయ నాయకులు గ్లాసులు పట్టుకుంటే జీరోలా? బాలకృష్ణ మామ ఏక్ పెగ్ లా అంటే, పవన్ కళ్యాణ్ మందుబాబులం అంటే యువకులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. సినిమాల్లో మందు తాగే సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు కట్ చేయాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

ఆంధ్రాలో గంధపు చెట్లను కొట్టేసి దొంగతనం చేస్తారు. కానీ నేను ఇప్ప చెట్లను వేయమంటున్నా.. ఆ చెట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇప్ప పూతతో సారా చేయొచ్చు.. పూత నూనెతో వంటల్లో వాడొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అని ఎమ్మెల్యే చెప్పారు.

సొంత ప్రభుత్వంపై కూడా అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా పేక్ తమాషా దేక్ నడుస్తుంది. పైసలు ఉన్నోడికి పనులు అవుతున్నాయి. పేదలు పనుల కోసం 10 సార్లు తిరగడం అవుతుంది అని ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Advertisement

తాజావార్తలు

Advertisement