త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | మీరు గెలిచినా.. నేను చంపేస్తా.. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే హెచ్చ‌రిక‌

MLA Anirudh Reddy | గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే నిధులు ఇస్తామ‌ని చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే.. నిధులు ఇవ్వ‌మ‌ని బ‌హిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.

S

Telangana | Published On Dec 16, 2025, 1.01 pm IST

MLA Anirudh Reddy | మీరు గెలిచినా.. నేను చంపేస్తా.. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే హెచ్చ‌రిక‌
Advertisement

MLA Anirudh Reddy | గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే నిధులు ఇస్తామ‌ని చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే.. నిధులు ఇవ్వ‌మ‌ని బ‌హిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను హెచ్చ‌రించారు. ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు గెలిచి వ‌చ్చినా.. వారిని నేను చంపేస్తాన‌ని ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాలకే నిధులు ఇస్తానని స్ప‌ష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా నేనే సంతకం పెట్టాలి.. ఇది ఓట‌ర్లు గుర్తుంచుకోవాల‌న్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సంతకం పెడుతాను అని ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచినా నిధులు ఇవ్వకుండా నేను చంపేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిపించమని బతిమాలుతున్నారు. వాళ్ల‌తో అభివృద్ధి జ‌ర‌గ‌దు. ఒక్క బీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలిచినా.. నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వను అని ఓట‌ర్ల‌ను జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement