త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wine Shops | ఎమ్మెల్యే సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి.. సంస్థాన్‌ నారాయ‌ణ‌పురంలో కొమ‌టిరెడ్డి అనుచ‌రుల హ‌ల్‌చ‌ల్‌

Wine Shops | మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) సొంత రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గలోని మ‌ద్యం దుకాణాలు (Wine Shops) మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత తెర‌వాలంటూ హుకుం జారీచేసిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On Jan 23, 2026, 2.03 pm IST

Wine Shops | ఎమ్మెల్యే సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి.. సంస్థాన్‌ నారాయ‌ణ‌పురంలో కొమ‌టిరెడ్డి అనుచ‌రుల హ‌ల్‌చ‌ల్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) సొంత రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గలోని మ‌ద్యం దుకాణాలు (Wine Shops) మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత తెర‌వాలంటూ హుకుం జారీచేసిన విష‌యం తెలిసిందే. అయితే సంస్థాన్‌ నారాయ‌ణపురంలో ఉన్న వైన్ షాపుల‌ను ఉద‌యం తెరిచారు. దీంతో అక్క‌డికి చేరుకున్న ఎమ్మెల్యే అనుచ‌రులు షాపును బ‌ల‌వంతంగా మూసేయించారు.

ఎమ్మెల్యే సార్ చెప్పిన స‌మ‌యానికి మ‌ద్యం దుకాణాలు తెర‌వాలన్నారు. లేదంటే షాపుల‌ను మొత్తానికి మూసేస్తామ‌ని వార్ణింగ్ ఇచ్చారు. దుకాణంలో ఉద్యోగులు ఉన్న‌ప్ప‌టికీ షెట్ట‌ర్ కిందికి వేసి లాక్ చేశారు. ఈ నేప‌థ్యంలో షాపు నిర్వాహ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా, నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు, పర్మిట్ రూమ్‌లు సాయంత్రం 6 గంటలకు తెరవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ‌తంలో దుకాణాల య‌జ‌మానుల‌కు చెప్పిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement