Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్
Konda Surekha | తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ తన మంత్రి పదవిని దక్కించుకునేందుకు కొండా సురేఖ చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి.
- గవర్నర్‌కు లేఖ అందజేసిన కాంగ్రెస్ పార్టీ
- ఆమోదించిన గవర్నర్
- పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ తన మంత్రి పదవిని దక్కించుకునేందుకు కొండా సురేఖ చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు బెంగళూరు, ఇటు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో నెరిపిన రాయబారం కూడా బెడిసికొట్టింది. చివరకు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ క్లియరెన్స్ ఇచ్చింది. సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో.. సీఎం రేవంత్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో లోక్‌భవన్‌లో గవర్నర్‌కు సీఎస్ ద్వారా సీఎం లేఖను పంపారు. దీంతో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు.
పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ తన మంత్రి పదవిని దక్కించుకునేందుకు కొండా సురేఖ చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు బెంగళూరు, ఇటు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో నెరిపిన రాయబారం కూడా బెడిసికొట్టింది. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో.. చేసేదేమీ లేక ఆ పదవి నుంచి తప్పుకున్నారామె.
పంతం నెగ్గిందా..?
కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం పంతం నెగ్గిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సుస్మిత పటేల్ సీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం.. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నేతలు కొండా సురేఖపై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీలోని ఓ వర్గం నేతలు తమ పంతం నెగ్గిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో సురేఖ మద్దతుదారులు, అనుచరులు.. కాంగ్రెస్ పార్టీలోని ఆ వర్గంపై మండిపడుతున్నారు.
నేనేలా బాధ్యురాలిని అవుతాను
తన కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి తప్పు చేయని తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఆవేదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా తాను సమర్థంగా పనిచేస్తున్నానని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. తనకు అప్పగించిన శాఖలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తున్నానని, ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని పేర్కొన్నారు. తనను మంత్రిగా కొనసాగించాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారని వెల్లడించారు. తనను బర్తరఫ్ చేయడం, సస్పెండ్ చేయడం వంటి అంశాలపై అధిష్ఠానం తనతో ఏమీ మాట్లాడలేదని సురేఖ స్పష్టం చేశారు.
రోజు వంద మంది ఆరోపణలు చేస్తరు..
ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలను సమర్థించినట్లవుతుందని విలేకరులు ప్రశ్నించగా.. రోజూ వందల మంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారని, వారిలో తన కుమార్తె కూడా ఒకరని అన్నారు. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని స్పష్టం చేశారు.
సుస్మిత చేసిన ఆరోపణలు ఏంటి..?
ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుస్మిత పటేల్ ఇలా వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని,రేవూరి ప్రకాశ్ రెడ్డి కాని, మీ తాత కానీ వచ్చి ఇక్కడ పోటీ చేయండని రేవంత్‌కు సవాల్ విసిరారు. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయించు. తాను అక్కడ పోటీ చేసి గెలుపొందుతానని అన్నారు. రేవూరి తనను రెచ్చగొట్టడం వల్లే తాను సభా వేధిక నుంచి సవాలు విసురుతున్నానని వెల్లడించారు.
పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ స్టేట్‌మెంట్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా అలా చెప్పుకోలేదని పేర్కొన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయావ్. ఆ విషయం మరిచిపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి సీతాదయాకర్ ఏమి చేశారని, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని, బీసీలు అంటే అంత చులకనా? అంటూ నిలదీశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీసీగా ఉండి ఏం చేస్తున్నారని, కొండా మురళీకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది బయపెట్టాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
- ●Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
- ●Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు




