త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KA Paul | అమ్మా కొండా సురేఖ‌! వేరే పార్టీలోకి వెళ్లొద్దు.. మీకు ప్ర‌జాశాంతి పార్టీ ఉంది

KA Paul | మంత్రి కొండా సురేఖన త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించిన‌ట్లు వెలువ‌డుతున్న వార్త‌ల వేళ ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొండా సురేఖ‌ను త‌మ పార్టీలోకి రావాల‌ని సూచించారు.

S

Telangana | Published On Sep 3, 2026, 2.04 pm IST

KA Paul | అమ్మా కొండా సురేఖ‌! వేరే పార్టీలోకి వెళ్లొద్దు.. మీకు ప్ర‌జాశాంతి పార్టీ ఉంది

సంక్షిప్త సారాంశం

ఈ కాంగ్రెస్ పార్టీలో ఇదే.. 5 శాతం ఉన్న రెడ్డీల‌కు 12 మందిని ముఖ్య‌మంత్రిని చేసింది 80 సంవ‌త్స‌రాల్లో. మ‌నం 50 శాతం బీసీల‌మున్నాం. 25 శాతం కాపుల‌మున్నాం. 90 శాతం బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలున్నా మ‌నల్నెందుకు చేయ‌లేదు ఒక్కసార‌న్నా ముఖ్యమంత్రిని? చెయ్య‌రు.. చెయ్య‌బోరు. ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోండి.

Advertisement
  • ఇప్ప‌టికైనా మ‌న‌మంతా ఒక్క‌ట‌వుదాం
  • ఎమ్మెల్యేలు, మంత్రుల‌య్యి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
  • ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

KA Paul | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి కొండా సురేఖన త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించిన‌ట్లు వెలువ‌డుతున్న వార్త‌ల వేళ ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొండా సురేఖ‌ను త‌మ పార్టీలోకి రావాల‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకుల పదవులకు ఎలాంటి డోకా ఉండదని, కేవలం బీసీ నాయకుల పదవులకే ప్రమాదం ఉంద‌ని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే మార్గమ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక వీడియో సందేశాన్ని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

కొండా సురేఖ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్నార‌ట‌. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇదే.. 5 శాతం ఉన్న రెడ్డీల‌కు 12 మందిని ముఖ్య‌మంత్రిని చేసింది 80 సంవ‌త్స‌రాల్లో. మ‌నం 50 శాతం బీసీల‌మున్నాం. 25 శాతం కాపుల‌మున్నాం. 90 శాతం బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలున్నా మ‌నల్నెందుకు చేయ‌లేదు ఒక్కసార‌న్నా ముఖ్యమంత్రిని? చెయ్య‌రు.. చెయ్య‌బోరు. ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోండి.

అందుకే నేన్ ఏమంటానంటే కొండా సురేఖ‌ను నా బీసీ బిడ్డ‌గా, మ‌హిళ‌గా.. నిన్ను ముఖ్య‌మంత్రిని చేయాలి. అలాంటిది మంత్రి ప‌ద‌విని ఎందుకు పీకేస్తున్నారని అడిగితే మీ కూతురు ఎవ‌ర్నో తిట్టింద‌ట‌. మ‌రి అలాగైతే జ‌గ్గారెడ్డి తిట్ట‌లేదా.. రేవంత్‌రెడ్డి 50 కోట్లు ఇచ్చి ముఖ్య‌మంత్రి అయ్యాడ‌ని. ఆయ‌న్ను ఎందుకు తీయ‌లేదు.. రెడ్డి కాబ‌ట్టి.

ఒక వెంట్రుక ముక్క‌..

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జ‌గ్గారెడ్డి, రేవంత్ ఇలా ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌ట్లేదా? ఆళ్ల ప‌ద‌వులు పోవు. ఒక మ‌హిళ అయితే, ఒక బీసీ అయితే, ఒక కాపు అయితే ఒక వెంట్రుక ముక్క‌. ఎందుకంటే మ‌న బీసీ బిడ్డ‌ల‌కు బుద్ధి లేక‌. పార్టీలు పెడ‌తారు.. ప్యాకేజీ స్టార్ల‌యి అమ్ముడుపోతారు. ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోండి మ‌నిషో పార్టీ పెట్ట‌కుండా.

అప్పులు తీరాల‌న్నా.. అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా ప్ర‌జాశాంతి పార్టీతోనే..

దేవుడు న‌న్ను పంపాడు. ఇది గ‌ద్ద‌ర‌న్న పార్టీ. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అంద‌ర్ని కాద‌ని ప్ర‌జాశాంతి పార్టీలో చేరి, ప్ర‌జ‌ల‌కు శాంతి రావాలంటే, అప్పులు తేరాలంటే, అభివృద్ధి జ‌ర‌గాలంటే ప్ర‌జాశాంతి పార్టీ రావాలి. మా పార్టీలో ఎంతోమంది సీనియ‌ర్స్ చేరారు. 13 ల‌క్ష‌ల కోట్లు తెలంగాణ అప్పు, 13 ల‌క్ష‌ల కోట్లు ఆంధ్రా అప్పు తేరాలంటే మ‌నమంద‌రం ఒక్క‌ట‌వ్వాలి. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అధికారం రావాలి. అంబేద్క‌ర్, గద్ద‌ర‌న్న పార్టీని గెలిపించాలి. మీరంద‌రూ ఎమ్మెల్యేలు, మంత్రుల‌య్యి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డానికి నేనున్నా.

Advertisement
Advertisement