Komatireddy Rajagopal Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్!
Komatireddy Rajagopal Reddy | ఇటీవల కాలంలో సొంత ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. మునుగోడు వేధికగా రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదేశించింది.
- నివేదిక కోరిన అధిష్టానం
- వీడియో ఫుటేజీలు పంపిన పీసీసీ చీఫ్
- త్వరలోనే కమిటీ ఏర్పాటు?
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: ఇటీవల కాలంలో సొంత ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. మునుగోడు వేధికగా రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదేశించింది. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియోలను పంపించినట్లు విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానమే (Congress High Command) ఒక కమిటీ వేసే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా భోగట్టా. ఆ కమిటీ విచారణ జరిపి, తుది నివేదికను ఢిల్లీ పెద్దలకు సమర్పించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత కమిటీ నివేదిక ఆధారంగా హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే?
మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృత్పితో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ (Congress) సర్కార్‌ను ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 18న (బుధవారం) మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మూడేండ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని.. మంచిగ పాలించి పదవులల్ల మీరే ఉండండని హాట్ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పాకులాడే అలవాటు తనకు లేదన్నారు. తెలంగాణ అంటే కొడంగల్ ఒక్కటే కాదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను (Bhatti Vikramarka) నిధులియ్యమని సూటిగా ప్రశ్నించారు.
అధిష్టానం అన్నప్పుడు చూస్తా..
మూడేండ్ల పరిపాలన తర్వాత ప్రజలు సంతోషంగా లేరు. మీరు పరిపాలన బాగ చేయండి.. మీరే పదవులల్ల ఉండండి. మా నియోజకవర్గ అభివృద్ధికి నిధులిచ్చి సహకరించండి. మీరేదన్న అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచిస్త తప్తే.. నేన్ మీ ఇంటికివోయి.. పదవుల కోసం ఇండ్ల సుట్టు తిరిగే అలవాటు నాకు లేదు. మునుగోడు ప్రజలు ఒక దమ్మున్న లీడర్‌ను గెలిపిచ్చిర్రు గానీ.. అడుక్కునే లీడర్‌ను కాదు వాళ్లు గెలిపిచ్చింది.
సస్పెండ్ చేస్తారా?
కాగా, స్వపక్షంలోనే విపక్షంగా తయారైన రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఏకవచనంతో విమర్శలు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే, ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చర్చించుకుంటున్నారు. కనీసం షోకాజ్ నోటీసు జారీ చేయడం లేదా పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
నవంబర్ 21, 2026

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



