Yennam Srinivas Reddy | రైతుల పక్షం కాంగ్రెస్‌ది.. అవినీతి పక్షం బీఆర్ఎస్‌ది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Yennam Srinivas Reddy | రైతుల పక్షం కాంగ్రెస్ పార్టీది అయితే అవినీతి పక్షం బీఆర్ఎస్ పార్టీది అని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఆయన స్పష్టం చేశారు.
Yennam Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : రైతుల పక్షం కాంగ్రెస్ పార్టీది అయితే అవినీతి పక్షం బీఆర్ఎస్ పార్టీది అని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో ప్రభుత్వం 11 బిల్లులను ప్రవేశపెట్టగా, అందులో 10 బిల్లులు ఆమోదం పొందాయి. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ బిల్లులను తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులు, ఉద్యోగులు, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాం. సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాం. మత సామరస్యాన్ని కాపాడుతూ, విద్వేషపూరిత నేరాలను అరికట్టే బిల్లు ప్రవేశపెట్టాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో న్యాయవాదులు అన్యాయానికి గురయ్యారు. న్యాయవాదులపై దాడులు జరిగినా సరైన రక్షణ ఇవ్వలేదు. లక్షలాది న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొచ్చామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉంది. చర్చకు ముందుకు రాకుండా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. గతంలో వివక్షకు గురైన శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క వంటి నాయకులు ఇప్పుడు సభను సమర్థంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వలేదని విమర్శించిన బీఆర్ఎస్, ఇప్పుడు చర్చలకు ముందుకు రావడం లేదు. మెట్రో రైల్ నిధుల అంశంపై కూడా బీఆర్ఎస్ హాజరు కాలేదు. అసెంబ్లీలో బడ్జెట్ పత్రాలను చింపి వేయడం ద్వారా సభ గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభను అడ్డుకున్నారు. ప్రభుత్వం రూ.15 లక్షల ఆరోగ్య భీమా పథకాన్ని రూపొందించింది. 75 ఏళ్లు దాటిన రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం అమలు చేస్తాం. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరితే ప్రభుత్వం మంచి పేరు వస్తుందని భయంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. గల్ఫ్ కార్మికుల సమస్యలపై కూడా బీఆర్ఎస్ స్పందించడం లేదు. గడ్డి మందు నిషేధంపై చర్చకు ఎందుకు దూరంగా ఉంటోందని అడిగారు.
రైతుల తీర్మానం నుంచి పారిపోయిన బీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. నోటీసుల పేరుతో సభను అడ్డుకోవడం బీఆర్ఎస్ డ్రామా అని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి అంశంపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో నిజాలు బయటపడుతున్నాయి. కుంభకోణం బయటపడుతుందనే భయంతో బీఆర్ఎస్ చర్చకు దూరంగా ఉంటోంది. సభలో కాకుండా బయట డ్రామాలు చేయడం బీఆర్ఎస్ అలవాటు. రైతుల పక్షం కాంగ్రెస్‌ది.. అవినీతి పక్షం బీఆర్ఎస్‌ది. మైనింగ్ కంపెనీలకు మద్దతు.. రైతులకు ద్రోహం బీఆర్ఎస్ వైఖరి. తెలంగాణ ప్రజల డబ్బుతో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమాధానం చెప్పాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



