Graduate MLC | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Graduate MLC | అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Sarvotham Reddy), మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని (Sama Rammohan Reddy) ఎంపిక చేసింది.
Graduate MLC | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఇద్దరు పట్టభద్రుల ఎమ్మెల్సీల (Graduate MLC) పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి ఓటర్ల నమోదు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాజకీయపార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Sarvotham Reddy), మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని (Sama Rammohan Reddy) ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) గాను మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను టీపీసీసీ (TPCC)ఎంపిక చేసి హైకమాండ్‌కు పంపంగా.. దీనిపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకున్నది. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి వర్గానికే కేటాయించడం గమనార్హం.
బలమైన రాజకీయ నేపథ్యం..
సూర్యాపేట జిల్లాకు చెందిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నది. ఆయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) కుమారుడు. యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో, నల్లగొండ జిల్లాలోనూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు. ఏఐసీసీ సభ్యుడైన సర్వోత్తమ్ రెడ్డి యువజన కాంగ్రెస్‌లో పలు హోదాల్లో పనిచేశారు.
యువజన కాంగ్రెస్ నుంచి..
సామ రామ్మోహన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా. ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్మూనికేషన్ చైర్మన్‌గా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ (Youth Congress) జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2017లో లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా, 2019లో అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టు.. తప్పదోవ పట్టించేలా సీఎం ఫొటో.. వ్యక్తిపై ఎఫ్ఐఆర్
సెప్టెంబర్ 12, 2026

Maheshkumar Goud | నేను ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు వినలే
సెప్టెంబర్ 8, 2026

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 30 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం!
- ●Inactive Ration Card Deactivate | 6 నెలలు సరుకులు తీసుకోకుంటే రేషన్ కార్డు కట్
- ●Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
- ●Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ
- ●TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

Horoscope | సెప్టెంబర్ 30 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం!

Inactive Ration Card Deactivate | 6 నెలలు సరుకులు తీసుకోకుంటే రేషన్ కార్డు కట్

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు

Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ



