Kishan Reddy | తెలంగాణ విమోచన వేడుకలు జరిపేందుకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy | తెలంగాణ విమోచన వేడుకలు జరపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఏంఐఎం మోచేతి నీళ్లు తాగి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ విమోచన వేడుకలు జరపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఏంఐఎం (MIM) మోచేతి నీళ్లు తాగి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వాల విధి అని, అందుకే విమోచన దినోత్సవం (Telangana Vimochana Diwas) పేరుతో తాము సెప్టెంబర్ 17న వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు రిహార్సల్స్‌ను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్నికేంద్ర ప్రభుత్వం గత ఐదేండ్లుగా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఇది విలీనం, విద్రోహం అనేవాళ్లకు తాము తెలంగాణ స్వాత్రంత్య్రం అంటామని చెప్పారు.
రజాకార్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, రక్తపు గుర్తులు కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో విముక్తి కలిగిందని వెల్లడించారు. నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ (Telangana) గడ్డకు ముక్తి లభించిందన్నారు. విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
90వ దశకంలో హైదరాబాద్ ముక్తి దివస్ చేయాలని అనేక పోరాటాలు చేశామని ప్రస్తావించారు. ఇది రాజకీయ పరమైన అంశం కాదని.. యావత్తు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించే విమోచన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
సెప్టెంబర్ 15, 2026

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 15, 2026

Mahesh Kumar Goud | రేవంత్‌తో అభిప్రాయ భేదాలు.. సాయంత్రానికే సరిచేసుకున్నాం
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే
- ●Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?
- ●Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి - మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్
- ●Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
- ●Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..
- ●BJP MLA Parag Shah Beggar | రూ.3,300 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు, సెక్యూరిటీ వదిలేసి ముంబై రోడ్లపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే

BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే

Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?

Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి - మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత



