BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం
BRS Party | ఈ నెల 7 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 6న ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
BRS Party | ఈ నెల 7 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 6న ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు భోజనం అనంతరం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరుకావాలని కేసీఆర్ సూచించారు.
శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వైఖరి, ప్రస్తావించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై శాసనసభలో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏయే అంశాలపై నిలదీయాలి, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలన్న దానిపైనా చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు, రైతులు, నిరుద్యోగులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ
- ●Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..
- ●Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్
- ●Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం

Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య

గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!






