త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల‌కు స్వ‌ల్ప లాభాలు..

Stock Markets | భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 362.57 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24.25 పాయింట్లు లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 76,515.43 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 23,897.70 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Sep 4, 2026, 3.53 pm IST

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల‌కు స్వ‌ల్ప లాభాలు..
Advertisement

Stock Markets | భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 362.57 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24.25 పాయింట్లు లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 76,515.43 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 23,897.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, సిప్లా షేర్లు నష్టాలను చవిచూశాయి. రంగాల వారీగా చూస్తే మెటల్ సూచీ 1 శాతానికి పైగా పెరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఫార్మా, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి సుమారు 0.5 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

మిడ్‌క్యాప్ సూచీ 0.2 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.2 శాతం లాభపడింది. మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్ 4.85 శాతం తగ్గి 10.79కి చేరింది. ఇది మార్కెట్‌లో అస్థిరతపై ఆందోళనలు కొంత తగ్గినట్లు సూచిస్తోంది. భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే శుక్రవారం ఎలాంటి మార్పు లేకుండా 94.49 వద్ద కొనసాగింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.78 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.23 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 91 డాల‌ర్ల వ‌ద్ద‌కు వ‌చ్చింది.

Advertisement
Advertisement