Cold Wave | పెరిగిన చలి తీవ్రత.. ఈ పది జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..!
Cold Wave | రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Cold Wave | హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది.
హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలుల తీవ్రత మరింత పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాల్ల్లో 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మిగతా జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
గురువారం ఉదయం కూడా చల్లని గాలులు వీచాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదికల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో 6.5 నుంచి 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.1, మౌలాలిలో 9.4, రాజేంద్రనగర్‌లో 9.5, గచ్చిబౌలిలో 11, గాజులరామారంలో 11.4, జీడిమెట్లలో 11.6, అల్వాల్‌లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల విషయానికి వస్తే ఆసిఫాబాద్ జిల్లాలో 5.7, సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్‌లో 7.7, వికారాబాద్‌లో 8.1, మెదక్ జిల్లాలో 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





