త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TIMS | రేపు సాయంత్రం 4.30 గంట‌ల‌కు మ‌ర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం

TIMS | స‌న‌త్‌న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(TIMS)ను రేపు సాయంత్రం 4.30 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు. టిమ్స్‌కు మాజీ సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి పేరు నామ‌క‌ర‌ణం చేసిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Aug 16, 2026, 3.43 pm IST

TIMS | రేపు సాయంత్రం 4.30 గంట‌ల‌కు మ‌ర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం
Advertisement

TIMS | త్రినేత్ర‌.న్యూస్ : స‌న‌త్‌న‌గ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(TIMS)ను రేపు సాయంత్రం 4.30 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు. టిమ్స్‌కు మాజీ సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి పేరు నామ‌క‌ర‌ణం చేసిన సంగ‌తి తెలిసిందే.

హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌నర్సింహా కొద్ది రోజుల క్రితం ప‌రిశీలించారు. హాస్పిటల్‌లోని A, B, C బ్లాకులను మంత్రి పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్‌లో వైద్య సేవల నిర్వహణ, మౌలిక వసతులు, మానవ వనరులు, నాన్‌-మెడికల్ సర్వీసులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఫైర్ సేఫ్టీ, ఇతర వ్యవస్థలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement