త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఈ స‌భ‌లో క‌త్తిపోట్లు, కుస్తీల పోటీలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఈ ర‌క‌మైన విధానాన్ని ఈ స‌భ క్ష‌మిస్తే.. భ‌విష్య‌త్‌లో ఈ స‌భ‌లో క‌త్తిపోట్లు, కుస్తీల పోటీలు జ‌ర‌గాల్సిన ప‌రిస్థితి వ‌స్త‌ద‌ని సీఎం పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 29, 2026, 2.04 pm IST

CM Revanth Reddy | ఈ స‌భ‌లో క‌త్తిపోట్లు, కుస్తీల పోటీలు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఈ ర‌క‌మైన విధానాన్ని ఈ స‌భ క్ష‌మిస్తే.. భ‌విష్య‌త్‌లో ఈ స‌భ‌లో క‌త్తిపోట్లు, కుస్తీల పోటీలు జ‌ర‌గాల్సిన ప‌రిస్థితి వ‌స్త‌ద‌ని సీఎం పేర్కొన్నారు.

శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి నిజాయితీ, నిబద్ధతను దేశంలో ఎవరూ శంకించలేరు. హరీష్ రావు, కేటీఆర్‌ను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్ధిస్తున్నారా? కడియంకు జరిగినట్లుగా కెసీఆర్ కు జరిగితే మీరు సమర్ధిస్తారా? ఇది మీ పార్టీ విధానామా..? క‌డియం శ్రీహ‌రికి జ‌రిగిన‌ట్లు రేపు చంద్ర‌శేఖ‌ర్ రావుకు జ‌రిగితే ఆమోదిస్తారా..? ఈ వైపులా కూడా అంత కంటే కండ‌లు తిరిగినోళ్లు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉన్నారా..? ఒక‌సారి లేచి నిల‌బ‌డు. మా దగ్గర కూడా తిరగేసి కొట్టేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం కుస్తీలు పట్టడానికి రాలేదు. విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించ‌డానికి, అవ‌గాహ‌న‌తో మాట్లాడ‌డానికి సభ‌కు వ‌చ్చాం. ఆకారం ఉంది క‌దా అని ఒక‌ పెద్ద మ‌నిషిని ప‌ట్టుకుని ఆ ర‌కంగా అవ‌మానించే విధంగా మాట్లాడ‌డం స‌రికాదు. ఈ ర‌క‌మైన విధానాన్ని ఈ స‌భ క్ష‌మిస్తే.. భ‌విష్య‌త్‌లో ఈ స‌భ‌లో క‌త్తిపోట్లు, కుస్తీల పోటీలు జ‌ర‌గాల్సిన ప‌రిస్థితి వ‌స్త‌ది. సీనియర్ సభ్యులను అవమానించే ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదు. దీనికి ఇక్కడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంది. స‌భ్యులు త‌మ చైర్ల‌లో కూర్చొని చ‌ర్చ‌లో పాల్గొంటే మంచిది. స‌భ‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే.. రాబోయే రెండు రోజులు స‌స్పెండ్ చేయాల‌ని కోరుతున్నాన‌ని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement