Azharuddin | మంత్రి అజారుద్దీన్‌కు పదవీ గండం.. గవర్నర్‌ను కలువనున్న సీఎం రేవంత్
Azharuddin | మైనార్టీ వ్యవహారాల మంత్రి అజారుద్దీన్‌కు (Azharuddin) పదవీ గండం పొంచిఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అజారుద్దీన్‌ను మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే.
Azharuddin | త్రినేత్ర.న్యూస్: మైనార్టీ వ్యవహారాల మంత్రి అజారుద్దీన్‌కు (Azharuddin) పదవీ గండం పొంచిఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అజారుద్దీన్‌ను మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో.. ఆయనను ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా (Governor Quota MLC) ప్రతిపాదించింది. కోర్టు వివాదం కారణంగా దానికి రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ ఆమోదం తెలపలేదు. ఆరు నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ఆ గడువు ముగియనుంది.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను (Governor Shiv Pratap Shukla) మరికాసేపట్లో కలువనున్నారు. గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram), అజారుద్దీన్ ఎమ్మెల్సీ పేర్లను ఆమోదించాలని కోరనున్నారు.అదేవిధంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ అంశంపై గవర్నర్‌తో చర్చించనున్నారు. కాగా, అజారుద్దీన్ విషయంలో గవర్నర్ ఎలా స్పందిస్తారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. వీరి నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని వారి పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో గత ఏడాది ఆగస్ట్ 30న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై చర్చించిన మంత్రిమండలి ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు ఫైల్ పంపింది. అయితే సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో వారి నియామకాలకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. ఇంతలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రావడం, అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టడం జరిగిపోయాయి. అయినా గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలో అజారుద్దీన్ పదవీకాలం ఆరు నెలుల పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



