CM Revanth Reddy | మూసీ ప్రక్షాళనపై రాజకీయాలు ఎందుకు..? : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | మూసీ ప్రక్షాళనను మీరు ప్రారంభించి వదిలేస్తే.. మేం ముందుకు తీసుకెళ్తున్నాం.. ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సభ్యులను నిలదీశారు. మూసీ ప్రక్షాళనపై అనవసర రాజకీయాలు ఎందుకు..? సలహాలు, సూచనలు ఇవ్వండి అని ప్రతిపక్షాలకు సీఎం సూచించారు.
ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచనను వీడండి..
సలహాలు, సూచనలు చేయండి..
ఎవరినీ నిరాశ్రయులను చేయం
మూసీ బాధితులకు మెరుగైన వసతి సౌకర్యాలు
రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి
శాసనమండలి వేదికగా సీఎం విజ్ఞప్తి
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మూసీ ప్రక్షాళనను మీరు ప్రారంభించి వదిలేస్తే.. మేం ముందుకు తీసుకెళ్తున్నాం.. ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సభ్యులను నిలదీశారు. మూసీ ప్రక్షాళనపై అనవసర రాజకీయాలు ఎందుకు..? సలహాలు, సూచనలు ఇవ్వండి అని ప్రతిపక్షాలకు సీఎం సూచించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నాం. దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు. మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పాడు. ప్రారంభించి మీరు వదిలేస్తే… మేం ముందుకు తీసుకెళుతున్నాం.. మీకున్న అభ్యంతరమేంటి? మూసీ ప్రక్షాళనపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు. ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టండి అని సీఎం సూచించారు.
ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం..
నాకు మీ సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే.. ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తా. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో ఒక కమిటీ వేస్తాం. మీ సలహాలు, సూచనలను కమిటీకి సమర్పించండి. మేం ఎవరినీ నిరాశ్రయులను చేయడంలేదు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎవరినీ నిరాశ్రయులను చేయం.. పునరావాసం కల్పిస్తానని మీ ద్వారా ప్రభుత్వం మాట ఇస్తుంది. ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం. మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని కోరుతున్నా. మా ప్రభుత్వం మీకు సహాయం అందిచేందుకు సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించకండి.. అభివృద్ధిని అడ్డుకోకండి అని సీఎం విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



