CM Revanth Reddy | విత్తేసి పొత్తు కూడాలి సుమా.. ఇందిరమ్మ ఇండ్లకు ఐదారు లక్షలు ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే.. లబ్ధిదారులు కూడా ఐదారు లక్షలు ఇవ్వాలి.. అప్పుడే మన ఇల్లుపై బాధ్యత ఉంటుందని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే.. లబ్ధిదారులు కూడా ఐదారు లక్షలు ఇవ్వాలి.. అప్పుడే మన ఇల్లుపై బాధ్యత ఉంటుందని సీఎం అన్నారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
గత ప్రభుత్వం 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పజెప్పితే.. అసలు మిత్తీ కట్టుకుంటేనే.. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశాం. పట్నం పెరిగింది అవసరాలు పెరిగాయి.. డబుల్ బెడ్రూం ఇల్లు అన్నారు.. ఆహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస్ మాదిరి పేదలను ఊరించారు. ఇక్కడ ఉన్నోళ్లకు ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయా..? సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో కట్టారని సీఎం గుర్తు చేశారు.
రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేసి ఇస్తున్నాం
ఇందిరమ్మ టవర్స్ నిర్మించబోయే ఈ భూమి విలువైన భూమి అని కొట్లాట పెట్టుకున్నారు. అయినా మాటిచ్చాం.. కట్టాల్సిందే.. అని 11 ఎకరాలు వెతికి.. పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తున్నాం. కోట్ల విలువైన భూములను పేదలకు ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.. రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేసి ఇస్తున్నాం. అయితే విత్తు వేసి పొత్తు కూడాలి.. అంటే ఐదు లక్షలు మేం ఇస్తాం.. మీరు ఐదారు లక్షలు ఇస్తే.. ఎట్ల కడుతున్నడో చూసుకుంటూ పోతరు.. పని చూసుకుని పోతరు.. అందుకే నగరంలో పేదవాళ్ల కోసం లక్ష ఇండ్లు కట్టాలని ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతం ముఖ్యంగా.. అత్యధికంగా పేదలు ఉండే ప్రాంతం ఇది.. ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు. వారందరికి మంచి పాఠశాలలు వైద్యం, ఉండడానికి ఒక సొంతిల్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. మీ సొంతింటి కల నెరవేరడానికి నూటికి నూరు శాతం అండగా ఉంటాం. ఎవరెన్ని చెప్పినా వినకండి అని సీఎం సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'

CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?




