OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..
OPPO K14 Lite | భారత మార్కెట్లో బడ్జెట్ కేటగిరీలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఒప్పో కె సిరీస్‌లో భాగంగా ఒప్పో కె14 లైట్‌ను అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ పనులకు తగిన పనితీరుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది. ఒప్పో కె14 లైట్‌లో ప్రధాన ఆకర్షణ 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ.
Technology | Published On Sep 16, 2026, 3.13 pm IST
OPPO K14 Lite | భారత మార్కెట్లో బడ్జెట్ కేటగిరీలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఒప్పో కె సిరీస్‌లో భాగంగా ఒప్పో కె14 లైట్‌ను అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ పనులకు తగిన పనితీరుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది. ఒప్పో కె14 లైట్‌లో ప్రధాన ఆకర్షణ 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. అధికారిక బెంచ్‌మార్క్ పరీక్షల ప్రకారం 1,800 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ తన ప్రారంభ సామర్థ్యంలో 80 శాతానికి పైగా నిలుపుకుంటుంది. సగటున ప్రతి 1.3 రోజులకు ఒకసారి ఛార్జ్ చేస్తే, ఇది దాదాపు ఆరు సంవత్సరాల వరకు ఉపయోగకరమైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ అంతర్గత పరీక్షల ప్రకారం బ్యాటరీ 55.55 గంటల వరకు వాయిస్ కాలింగ్, 29.99 గంటల వరకు నిరంతర గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 26.84 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్, పబ్‌జీ మొబైల్ వంటి గేమ్స్‌లో 13.19 గంటల వరకు గేమింగ్‌ను అందిస్తుంది.
ప్రత్యేక కూలింగ్ లేయర్..
ఛార్జింగ్ కోసం 15 వాట్ల ఛార్జింగ్ సదుపాయం ఉంది. సుమారు 30 నిమిషాల్లో బ్యాటరీ 21 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ కావడానికి 2 గంటల 52 నిమిషాలు పడుతుంది. అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉండడంతో ఇతర పరికరాలకు కూడా ఫోన్ ద్వారా ఛార్జింగ్ అందించవచ్చు. ఇందులో యూనిసాక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందించారు. దీనికి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ జత చేశారు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 2 టెరాబైట్ల వరకు విస్తరించుకోవచ్చు. ఎక్కువసేపు వినియోగించినప్పుడు వేడిని సమర్థంగా నియంత్రించేందుకు 13,700 చదరపు మిల్లీమీటర్ల గ్రాఫైట్ కూలింగ్ లేయర్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. సాధారణ బ్రైట్‌నెస్ 700 నిట్స్ కాగా, గరిష్ఠంగా 900 నిట్స్ వరకు చేరుతుంది. దీంతో బయట కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడడానికి వీలుంటుంది. వర్షం, చెమట లేదా చేతులపై నూనె ఉన్న సందర్భాల్లో కూడా టచ్ స్పందన మెరుగ్గా ఉండేలా స్ప్లాష్ టచ్, ఆయిలీ-హ్యాండ్ టచ్, గ్లోవ్ టచ్ టెక్నాలజీలను అందించారు.
డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్..
డిజైన్ పరంగా వెనుక భాగంలో టెక్స్చర్డ్ ప్యాటర్న్, రౌండెడ్ కార్నర్లు, అడ్డంగా ఏర్పాటు చేసిన కెమెరా డెకో ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి, రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ఫోన్‌కు ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను, ముందుభాగంలో 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అందించారు. కెమెరాలో నైట్, టైమ్-ల్యాప్స్ వంటి సాధారణ మోడ్‌లతోపాటు ఏఐ ఎరేజర్, ఏఐ క్లియర్ ఫేస్, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో ఫోన్ పనిచేస్తుంది. గూగుల్ జెమిని, గూగుల్ లెన్స్, ప్రైవసీ సేఫ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
ధర వివరాలు..
ప్రస్తుతం ఒప్పో కె14 లైట్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేశారు. దీని ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1వేయి వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ప్రభావిత ప్రారంభ ధర రూ.15,999కు తగ్గుతుంది. అలాగే మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బుధవారం నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో అధికారిక ఈ-స్టోర్లో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. స్టోన్ బ్రౌన్, ఫెదర్ పర్పుల్ రంగుల్లో ఫోన్‌ను లాంచ్ చేశారు.
తాజావార్తలు
- ●Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
- ●Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
- ●CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి
- ●Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..
- ●CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
- ●KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!

Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు

CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి

Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..



