త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సంక్షేమ ప‌థ‌కాలు బ‌రువైనాయి.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్(సంక్షేమ‌) క‌మిట్‌మెంట్స్ బ‌రువైనాయి అని సీఎం అన్నారు. ఈ స‌మ‌యంలో మీకు నిధులు ఇవ్వాలంటే స‌ద్వినియోగం చేసుకుంటార‌న్న న‌మ్మ‌కం, విశ్వాసం క‌లగాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Mar 9, 2026, 8.54 pm IST

CM Revanth Reddy | సంక్షేమ ప‌థ‌కాలు బ‌రువైనాయి.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

పోలీసు శాఖలో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం
సిబ్బందిని హేతుబ‌ద్ధీక‌రించుకోండి
అంద‌రి పనితీరుపై నా వ‌ద్ద డేటా ఉంది
రిలాక్స‌వ‌కండి..ఆటోమోడ్‌లోకి వెళ్ల‌కండి
అలా చేస్తే స‌మాజానికి ప్ర‌మాదం
సిబ్బందితో, బాధితుల‌తో
మాన‌వీయ కోణంతో వ్య‌వ‌హ‌రించండి
పోలీసుల రీట్రీట్ లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్(సంక్షేమ‌) క‌మిట్‌మెంట్స్ బ‌రువైనాయి అని సీఎం అన్నారు. ఈ స‌మ‌యంలో మీకు నిధులు ఇవ్వాలంటే స‌ద్వినియోగం చేసుకుంటార‌న్న న‌మ్మ‌కం, విశ్వాసం క‌లగాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసు అకాడ‌మీలో నిర్వ‌హించిన తెలంగాణ పోలీసు ఆఫీస‌ర్స్ రిట్రీట్ -2026 కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

పోలీసు శాఖ‌కు నిధులు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ న‌మ్మ‌కం క‌లిగించాలి. ల్యావిష్‌గా స్పెండ్ చేసేంత ల‌గ్జ‌రీ మ‌న ద‌గ్గ‌ర లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్... మీ అంద‌రికీ తెలుసు. స్టేట్‌కు ఉన్న అప్పులు కానీ, ఇత‌ర ప‌రిస్థితులు కానీ. ఇక నేను పెట్టుకున్న వెల్ఫేర్(సంక్షేమ‌) క‌మిట్‌మెంట్స్ ఇంకా బ‌రువైనాయి. వీట‌న్నింటిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూనే మీకు నిధులు ఇవ్వాలి అంటే స‌ద్వినియోగం జ‌రుగుతాయ‌నే న‌మ్మ‌కం, విశ్వాసం క‌ల‌గాలి. చ‌ట్టం రూపంలో మార్చుకుంటే నిధులు వ‌స్తాయి.. ర‌క్ష‌ణ క‌ల్పించ‌బ‌డుతుంది అని సీఎం వ్యాఖ్యానించారు.

మీరు ఏ కేట‌గిరో నాకు తెలుసు..!

ఈ రెండేండ్ల‌లో పైర‌వీలు చేసిన వారెవ‌రూ లేరు. నాకు, శివ‌ధ‌ర్ రెడ్డి, సీఎస్‌కు మాత్ర‌మే పోస్టింగ్‌ల విష‌యం తెలుసు. మీరు టీవీల్లో మాత్ర‌మే చూసుకున్నారు. పొలిటిక‌ల్ ఎగ్జిక్యూటివ్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ల‌కు కూడా తెలియ‌దు. ఐపీఎస్ అధికారుల విష‌యంలో మూడు కేట‌గిరిల కింద జాబితా సిద్ధం చేసుకున్నా. అధికారి పేరు చెబితే వారు ఏ కేట‌గిరినో ఆటోమేటిక్‌గా తెలిసిపోత‌ది. వారికి ఎస్పీ కేడ‌ర్ ఇవ్వాలా..? ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఇవ్వాలా..? లేదంటే ఖాళీగా ఎవ‌ర్నీ కూర్చోబెట్టాల‌ని లిస్ట్ చేసి పెట్టుకున్నాను అని సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాబ‌ట్టి పోలీసు అధికారులు కూడా డేటా ఆధారంగా అనాల‌సిస్‌తో ప‌ని చేసిన‌ప్పుడు రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని సీఎం వ్యాఖ్యానించారు.

ఆల్రెడీ భోజ‌నాలు అయిపోయాయి..

ఆల్రెడీ భోజ‌నాలు అయిపోయాయి.. వాళ్ల దాంట్లో వీళ్ల దాంట్లో కొంచెం త‌గ్గించి వ‌డ్డించేందుకు ప్ర‌య‌త్నిస్తాం. డిసెంబ‌ర్‌లోనే రిట్రీట్ చేసుకుంటే కొంత స‌మ‌యం దొరుకుతుంది. కొంత నిధులు ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. త‌ప్ప‌నిస‌రిగా ఈ ప్రోగ్రామ్‌ను తీసుకోండి. ఆ త‌ర్వాత వ‌చ్చే 2, 3 నెల‌ల్లో బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేస్తాం. కొంత వెసులుబాటు దొరుకుతుంది అని సీఎం రేవంత్ తెలిపారు.

Advertisement
Advertisement