త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రఘునంద‌న్ రావును ఓడ‌గొట్టాల‌ని మ‌స్తు తిరిగిన‌.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావును ఓడ‌గొట్టాల‌ని మ‌స్తు తిరిగిన అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ ఇవాళ అభివృద్ది విష‌యంలో ఇద్ద‌రం స‌మ‌న్వ‌యం చేసుకుంటేనే అభివృద్ధి జ‌రుగుత‌ద‌ని సీఎం అన్నారు.

S

Telangana | Published On Mar 22, 2026, 5.51 pm IST

CM Revanth Reddy | రఘునంద‌న్ రావును ఓడ‌గొట్టాల‌ని మ‌స్తు తిరిగిన‌.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావును ఓడ‌గొట్టాల‌ని మ‌స్తు తిరిగిన అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ ఇవాళ అభివృద్ది విష‌యంలో ఇద్ద‌రం స‌మ‌న్వ‌యం చేసుకుంటేనే అభివృద్ధి జ‌రుగుత‌ద‌ని సీఎం అన్నారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయాలు.. ఎన్నిక‌లు అయిపోయాక అభివృద్ధి గురించి ఆలోచించాలి. గ‌త ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్ రావును ఓట‌గొట్టాల‌ని మ‌స్తు తిరిగిన‌. కానీ ఇప్పుడు మేం ఇద్ద‌రం స‌మ‌న్వ‌యం చేసుకుంటే అభివృద్ధి జ‌రుగుతుది. ఈ జిల్లాలోని సాగునీటి స‌మ‌స్య‌ల‌ను ర‌ఘునంద‌న్ రావు విన్న‌వించిండు. అవి నెర‌వేర్చ‌డం నా బాధ్య‌త‌. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం జ‌రుగుతుంది.. మ‌నకు ఎరువులు, గ్యాస్ అక్క‌డ్నుంచే రావాలి. యూరియా కొర‌త‌ వ‌చ్చేలా ఉంది. కాబ‌ట్టి మ‌న‌కు రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్ కార్పొరేష‌న్‌లో ఉత్ప‌త్తి చేసే యూరియా మ‌న‌కే ఇవ్వాలి. ఒక్క డెలిగేష‌న్ తీసుకుని మ‌న ఎంపీల‌తో పాటు బీజేపీ ఎంపీల‌ను తీసుకుని కేంద్ర మంత్రి దృష్టికి ఎరువుల కొర‌త‌ను తీసుకెళ్లాలని మంత్రి తుమ్మ‌ల‌కు సూచిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి యూరియా తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ఎందుకంటే వ‌రి పండిస్తున్నారు కాబ‌ట్టి యూరియా కావాలి. నానో యూరియా వైపు మారాలి. ఖ‌రీఫ్ పంట‌ల్లో యూరియా స‌మ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇవ‌న్నీ చేయాలంటే రాజ‌కీయ స‌మ‌న్వ‌యం ఉండాలి. ఎన్నిక‌లు అయిపోయాక అభివృద్ధికి అంకిత‌మ‌వుందాం. మంచి రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాలని సీఎం సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement