త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మ‌గాళ్ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే బెల్ట్ షాపుల‌కిస్తారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | మ‌గాళ్ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే సాయంత్రం కాగానే బెల్ట్ షాపుల‌కు ఇస్తారు.. అదే మా అక్క‌ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే పిల్ల‌ల చ‌దువుకు, వ్య‌వ‌సాయానికి ఖ‌ర్చు పెడుతారు.. అందుకే ప్ర‌తి ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల ప్ర‌తిపాదిక‌నే అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Mar 22, 2026, 7.06 pm IST

CM Revanth Reddy | మ‌గాళ్ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే బెల్ట్ షాపుల‌కిస్తారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

అందుకే ప్ర‌తి ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల ప్ర‌తిపాదిక‌నే అమ‌లు
ఆర్టీసీ బ‌స్సుల‌కు మ‌హిళ‌లు య‌జ‌మానుల‌య్యారు
వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్ప‌త్తి చేస్తున్నారు
2034 వ‌ర‌కు కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మ‌గాళ్ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే సాయంత్రం కాగానే బెల్ట్ షాపుల‌కు ఇస్తారు.. అదే మా అక్క‌ల వ‌ద్ద న‌గ‌దు ఉంటే పిల్ల‌ల చ‌దువుకు, వ్య‌వ‌సాయానికి ఖ‌ర్చు పెడుతారు.. అందుకే ప్ర‌తి ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల ప్ర‌తిపాదిక‌నే అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

ఇందిర‌మ్మ ఇండ్లు, రేష‌న్ కార్డు, ఉచిత విద్యుత్.. ఇలా ఏ సంక్షేమ ప‌థ‌కం అయినా మ‌హిళ‌ల ప్ర‌తిపాదిక‌నే ఇస్తున్నాం. ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాం. ఈ ఉచిత ప్ర‌యాణానికి నెల‌కు ఆర్టీసీకి రూ. 350 కోట్లు చెల్లించి, ఆర్టీసీ కార్మికుల‌ను ఆదుకుంటున్నాం. వెయ్యి బ‌స్సుల‌ను కొనుగోలు చేసి మ‌హిళ‌లు ఆ బ‌స్సుల‌కు య‌జ‌మానులు అయ్యారు. ఆ బ‌స్సుల‌న్నింటినీ ఆర్టీసీ సంస్థ‌లో కిరాయికి పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలు కాదు.. ఇవాళ ఆడ‌బిడ్డ‌లు ఆర్టీసీ బ‌స్సుల‌కు య‌జ‌మానులు అయ్యారు. పెట్రోల్ బంకులు పెట్టించాం. స్వ‌యంగా న‌డుపుకుంటున్నారు అని రేవంత్ పేర్కొన్నారు.

స్వ‌యం శ‌క్తితో ఎదిగిన‌ప్పుడే కుటుంబంలో గౌర‌వం

67 ల‌క్ష‌ల మంది మ‌హిళా సంఘాల్లో స‌భ్యులుగా ఉన్నారు. 2034 లోపు కోటి మంది స‌భ్యుల‌ను చేసి కోటీశ్వ‌రుల‌ను చేయాల‌ని, ఈ క్ర‌మంలో విశ్ర‌మించొద్ద‌ని అధికారుల‌కు చెప్పాం. ఇక 28 నెల‌ల్లో 57 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ఇచ్చి జీరో వ‌డ్డీ మీద 1350 కోట్లు బ్యాంకుల‌కు క‌ట్టింది మా ప్ర‌భుత్వం. సోలార్ విద్యుత్ అంటే.. అదానీ, అంబానీల పేరు వినిపించేది. ఇప్పుడు రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు ఆడ‌బిడ్డ‌లు య‌జ‌మానులు అయ్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. హైటెక్ సిటీ ప‌క్క‌న శిల్పారామం వ‌ద్ద 3.5 ఎక‌రాల్లో 1000 కోట్ల విలువైన భూమిలో 106 స్టాల్స్ ఏర్పాటు చేసి మ‌హిళా సంఘాల‌ వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తున్నాం. స్వ‌యం శ‌క్తితో ఎదిగిన‌ప్పుడే కుటుంబంలో గౌర‌వం ఉంటుంది అని సీఎం తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement