త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప్ర‌జా ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ. 3.47 ల‌క్ష‌ల కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించామ‌ని సీఎం తెలిపారు.

S

Telangana | Published On Mar 20, 2026, 6.16 pm IST

CM Revanth Reddy | ప్ర‌జా ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ. 3.47 ల‌క్ష‌ల కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

గ‌త ప్ర‌భుత్వ అప్పులు, వ‌డ్డీలు రూ. 3.30 ల‌క్ష‌ల కోట్లు చెల్లించాం
ఇది ఫ్యూచ‌రిస్టిక్ బ‌డ్జెట్
ప్ర‌తి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం
ఇక‌పై టెన్త్ ప‌రీక్ష‌లు ఉండ‌వు..
ప్రీ ప్రైమ‌రీ నుంచి ప్ల‌స్ టూ వ‌ర‌కు ఒకే విద్యా విధానం

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వివిధ విభాగాల్లో ఉన్న లీకేజీలను అరికడుతున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నామ‌ని సీఎం తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే నిధుల కేటాయింపు జరిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్ద పీట వేసింది. అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించాం. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాం. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నాం. రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తించనుందని సీఎం స్ప‌ష్టం చేశారు.

విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించాం. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తాం. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభుత్వ స్కూల్లో చదివే విధానాన్ని అమలు చేస్తున్నాం. అప్పులు, ఆదాయానికి సంబంధించి పారదర్శకంగా అన్ని వివరాలు వెల్లడించామ‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement