CM Revanth Reddy | అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలి.. అప్పుడే పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీసు ఆఫీసర్స్ రిట్రీట్ -2026 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
టెక్నికల్, అడాప్టివ్ ఛాలెంజ్ ముఖ్యం
సమస్యను అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం సులువు
అర్థం చేసుకోకుండా వేగంగా కదలడం సరికాదు
శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ
సాంకేతిక పరంగా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తాం
పోలీసు ఆఫీసర్స్ రిట్రీట్-2026 సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలి.. అప్పుడే పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీసు ఆఫీసర్స్ రిట్రీట్ -2026 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎక్కడున్నమో తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో సులువు అవుతుంది. 2002లో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేశాం. మళ్లీ చేయాల్సిన అవసరం ఉంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాలు వాటి వేగాన్ని చర్చించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుందని నా దృష్టికి తీసుకొచ్చారు. 2025 డిసెంబర్‌లోనే ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలి అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడింది. మొత్తానికి ఇవాళ విజయవంతం చేసుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అప్పుడే 50 శాతం పరిష్కారం దొరకుతుంది..
సమస్యలను అర్థం చేసుకోవాలంటే రెండు ఛాలెంజ్‌లు ముఖ్యం. అందులో ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్. టెక్నికల్ ఛాలెంజ్‌కు వనరులు, సమయం చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు ఉంటే.. సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ టెక్నాలజీకి విజ్ఞత ఉండాలి.. సమస్యలను అర్థం, అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరుగెత్తుతాం. కానీ పరిష్కారం కాకపోగా, మరింత గందరగోళానికి దారితీస్తుంది. ఎంత ఉపద్రవం ముంచుకొచ్చినా పోలీసు శాఖ అధికారులకు ఉండాల్సిన సంయమనం ఏందంటే మొదటగా సమస్యను అర్థం చేసుకోవాలి. అప్పుడే 50 శాతం పరిష్కారం దొరకుతుంది. మీకు ఎదురైన సమస్యను లోతును అవగాహన చేసుకుంటే పరిష్కారం సులువు అవుతుంది. అర్థం చేసుకోకుండా వేగంగా కదిలితే అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు అని సీఎం అన్నారు.
శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగిన నగరాల్లోనే పరిశ్రమలు..
సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ట్రాఫిక్, రిక్రూట్‌మెంట్, ఆర్థిక సమస్యలు, స్టాఫ్ ప్యాటర్న్ కావొచ్చు.. 245 మంది అధికారులు ఇక్కడున్నారు. ప్రతి వర్టికల్‌కు ఒక డీజీపీ కేడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ ఇందులో ఆసక్తి కలిగిన అధికారులు కూర్చొని సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని ప్రతిపానదలను నా ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామం, పట్టణం, నగరంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి, ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలు నిర్వహించడానికి రారు. ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగిన నగరాల్లోనే పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
సాంకేతిక పరంగా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తాం
పాలసీలు లేకుండా పని చేస్తే పాలసీ పారాలసిస్ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలను తీసుకువచ్చింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జనాభాలో రెండున్నర శాతం మనం ఉన్నాం. కానీ ఈ దేశ జీడీపీలో 5 శాతం మనం కంట్రిబ్యూట్ చూస్తున్నాం. రాబోయే 22 ఏండ్లలో ఈ దేశం 100 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం. ఆ సమయం నాటికి తెలంగాణ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సాంకేతిక పరంగా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తున్నది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




