CM Revanth Reddy | చిన్నారెడ్డిని గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్
CM Revanth Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటర్ విద్య నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 1984లో జిల్లెల చిన్నారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని నాడు గోడల మీద రాసి ప్రచారం చేశానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటర్ విద్య నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 1984లో జిల్లెల చిన్నారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని నాడు గోడల మీద రాసి ప్రచారం చేశానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. కొత్తకోటలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఏమవుతారు.. ఏం కారు కదా అని కుటుంబ సభ్యులు, బంధువులు అంటుంటారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావొచ్చు అని నన్ను చూపించండి. నేనేం పైనుంచి ఊడిపడలేదు. ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందకు రాలే. ఇదే వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి సీఎం అయ్యాను.. ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల సందర్భంలో నేను ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు చిన్నారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. ఆయనను గెలిపించండి అని గోడల మీద రాసి ప్రచారం చేశాను. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తే.. ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని చూపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే మంత్రులు, ఇంజినీర్లు, డాక్టర్లు కావొచ్చు.. ఆపై మాట్లాడితే నన్ను చూపించండి సీఎం కావొచ్చని అని సీఎం విద్యార్థులకు సూచించారు.
పలుగుపార పట్టిన ఈ చేతులే కలం పట్టి తెలంగాణ తలరాతను మార్చాలి
పలుగుపార పట్టిన ఈ చేతులే కలం పట్టి తెలంగాణ తలరాతను మార్చాలి. మూడు ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు షాదీ ముబారక్ కొంత మేలు చేస్తాయి. కానీ చదువు, బ్రేక ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం సద్వినియోగం చేసుకుని చదువుకుని రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. మన భవిష్యత్‌కు వెలుగులు నింపుతుందని సీఎం అన్నారు.
సంబంధిత వార్తలు

Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను సాకుగా చూపకండి సీఎం రేవంత్ : మాజీ ఎంపీ వినోద్
జులై 15, 2026

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026

RS Praveen Kumar | రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ
జులై 15, 2026
తాజావార్తలు
- ●Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?
- ●Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్
- ●MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు
- ●Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
- ●Mahabubnagar Journalists Boycott | మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ
- ●Cabinet Decisions | దేశీయ సెమీకండక్టర్ రంగానికి భారీ బూస్ట్.. రూ.1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0

Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?

Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్

MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు

Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..



