త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | వ‌రి పంట‌ను త‌గ్గించండి.. రైతుల‌కు సీఎం రేవంత్ సూచ‌న‌

CM Revanth Reddy | రాష్ట్రంలో వ‌రి పంట‌ను త‌గ్గించాల‌ని రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న చేశారు. పంట మార్పిడి చేయాల్సిన అస‌వ‌రం ఏర్ప‌డింద‌ని, అందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం అన్నారు. లాభ‌సాటి వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేయాల‌ని సీఎం సూచించారు.

S

Telangana | Published On Mar 22, 2026, 6.50 pm IST

CM Revanth Reddy | వ‌రి పంట‌ను త‌గ్గించండి.. రైతుల‌కు సీఎం రేవంత్ సూచ‌న‌
Advertisement

ప్రత్యామ్నాయ పంటలకు రైతులు సన్నద్ధం కావాలి
పంట మార్పిడి వైపు దృష్టి పెట్టండి
వ్యవసాయం లాభసాటిగా మార్చుదాం
రైతులకోసం కేసీఆర్ నెలకు 2533 కోట్లు ఖర్చు చేస్తే
మేం 5500 కోట్లు ఖర్చు చేస్తున్నాం
28 నెలల్లో రైతుల కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేశాం
ప్ర‌తీ గ్రామాన్ని అంకాపూర్‌లాగా తీర్చిదిద్దుదాం..

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో వ‌రి పంట‌ను త‌గ్గించాల‌ని రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న చేశారు. పంట మార్పిడి చేయాల్సిన అస‌వ‌రం ఏర్ప‌డింద‌ని, అందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం అన్నారు. లాభ‌సాటి వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేయాల‌ని సీఎం సూచించారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్ సీఎంగా 114 నెల‌లు ప‌ని చేశారు. ప్ర‌తి నెల స‌రాస‌రి రైతుల కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం రూ. 2533 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. మ‌న ప్ర‌భుత్వం 28 నెల‌ల్లోనే స‌రాస‌రి ప్ర‌తి నెల రూ. 5500 కోట్లు ఖ‌ర్చు పెడుతుంది. ఎందుకంటే రైతు సంక్షేమం కోసం. ఈనాడు 24 గంట‌ల క‌రెంట్, గిట్టుబాటు ధ‌ర‌, బోన‌స్ కావొచ్చు, రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, బీమా కార్య‌క్ర‌మాలు కావొచ్చు.. అకాల వ‌ర్షాల‌కు పంట దెబ్బ‌తిన‌డం కావొచ్చు. ప్ర‌తి రైతుకు పంట న‌ష్టం జ‌రిగితే.. ఎక‌రాకు రూ. 10 వేల చొప్పున‌ న‌ష్ట ప‌రిహారం అందించి అన్న‌దాత‌ల‌ను ఆదుకున్నాం. ల‌క్షా 40 వేల కోట్లు రైతుల కోసం ఖ‌ర్చు పెట్టి రైతును రాజును చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం. మీ ఆశీర్వాదం అండ‌దండ‌లు ఉండ‌డంతో ఈ కార్య‌క్ర‌మాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామ‌ని సీఎం అన్నారు.

0 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ పండించిన కొంటాం..

మా ప్ర‌భుత్వ హ‌యాంలో 2 కోట్ల 58 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి ఉత్ప‌త్తి చేసి దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాం. నిజాం స‌ర్కార్ ఉన్న‌ప్పుడే నిజాం చ‌క్కెర ఫ్యాక్ట‌రీ క‌ట్టారు. వాణిజ్య పంట‌లు పండించ‌డంలో ఈ ప్రాంత రైతులు చైత‌న్యం ఉన్న‌వారు. సోయాబీన్, మొక్క‌జొన్న, ఎర్ర‌జొన్న‌లు, చెరుకు, పస‌పు పండించేవారు. ఒక‌ప్పుడు ఒక క్వింటాల్ ప‌సుపు అమ్మితే తులం బంగారం కొనేవారు. ఇప్పుడు తులం బంగారం రూ. 2 ల‌క్ష‌లు అయింది.. ప‌సుపుకు మాత్రం ధ‌ర లేదు. అందుకే వ్వ‌సాయంలో మార్పు రావాల‌ని పామాయిల్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట 3 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు చేరింది. భ‌విష్య‌త్‌లో 10 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ పండించిన కొంటాం. లాభ‌సాటి వ్య‌సాయంగా మారుతంది కాబ‌ట్టి. ఈ త‌రుణంలో పంట మార్పిడి చేయాలని సీఎం సూచించారు.

మిల్లెట్స్, ఆకూకూర‌లు పండించాలి..

రంగారెడ్డి జిల్లాతో పాటు ఇత‌ర జిల్లాల్లో రియ‌ల్ ఎస్టేట్ పెరిగింది. పండ్ల‌ తోట‌లు లే అవుట్లు అయిపోయాయి. పాలు, కూర‌గాయ‌లు, చికెన్, కోడిగుడ్లు దిగుమ‌తి చేసుకుంటున్నాం. దీనికి కార‌ణం ఏంటో రైతున్న‌లు ఆలోచించాలి. రైతుల్లో చైత‌న్యం తీసుకురావాలి. వ‌డ్లు ఒక్క‌టే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాదు. పండించిన వ‌డ్లను ప్ర‌పంచానికి స‌ర‌ఫ‌రా చేసిన మిగిలిపోయే ప‌రిస్థితి ఉంది. కేంద్ర మంత్రిని క‌లిస్తే 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ కంటే ఎక్కువ కొన‌లేం అన్న‌రు. మేం 71 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొన్నం. మిగ‌తా ధాన్యాన్ని ఏం చేయాలి. స‌న్న‌బియ్యం ఇచ్చిన కూడా ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మిగిలిపోతున్నాయి. విదేశాల‌కు ఎగ‌మ‌తి చేద్దామంటే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేదు. కాబ‌ట్టి పంట మార్పిడి చేయాలి. మిల్లెట్స్, ఆకూకూర‌లు పండించాలి అని సీఎం కోరారు.

పంట మార్పిడి కోసం ప్రణాళిక‌లు సిద్ధం చేయాలి..

పంట మార్పిడి కోసం ప్రణాళిక‌లు సిద్ధం చేయాలి. కేంద్రం, రాష్ట్రం క‌లిసి లాభ‌సాటి వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేయాలి. ఆయిల్ పామ్ పంట నాలుగేండ్ల వ‌ర‌కు చేతికి రాదు. కాబ‌ట్టి మొద‌టి నాలుగేండ్లు రైతును ఆదుకోవాలి. అందుకు కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి ఆర్థిక తోడ్పాటు అందిద్దాం. మా కొడంగ‌ల్‌లో అత్య‌తంత వెనుక‌బ‌డిన ప్రాంతం. సిద్దిపేట మాదిరే కొడంగ‌ల్‌లోనూ ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాలి. ఇది మంచి లాభ‌సాటి వ్వ‌వ‌సాయం. ఇలాంటి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తే మ‌న పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి, కుటుంబం బాగుప‌డేందుకు ఎవ‌రి ద‌గ్గ‌ర్నో చేయి చాప‌డం అవ‌స‌రం లేదు అని సీఎం అన్నారు.

ప్ర‌తి గ్రామ‌పంచాయ‌తీ ఒక అంకాపూర్ కావాలి..

అంకాపూర్‌లో లాభ‌సాటి వ్య‌వ‌సాయం చేశారు. తెలంగాణ‌లో 12728 గ్రామ‌పంచాయ‌తీలు ఉన్నాయి. ప్ర‌తి గ్రామ‌పంచాయ‌తీ ఒక అంకాపూర్ కావాలి. పంట‌లు పండించి ప్ర‌తి రైతు కారు కొనుగోలు చేసే స్థాయికి రావాలి. 12728 గ్రామ పంచాయ‌తీల‌ను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త మాపై ఉంది. రైతుల‌ను భుజాల‌కు ఎత్తుకుందాం. రైతులు వేరే పంట‌కు పోతే న‌ష్టం జ‌రుగుతద‌ని ఆలోచించొద్దు. ప్ర‌స్తుతం మిల్లెట్స్ అధికంగా కొంటున్నారు. అదే మ‌న ద‌గ్గ‌ర పండిస్తే లాభాసాటిగా ఉంటుంది. ఇక్రిశాట్ ఇక్క‌డే ఉంది. వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రాన్ని మెద‌క్ జిల్లాలోనే పెట్టారంటే ఇక్క‌డ సార‌వంత‌మైన భూములు ఉన్నాయి. ఒక్కో జిల్లాల్లో ఒక్కో పంట‌కు ప్ర‌త్యేక‌త ఉంద‌ని. ఈ సార‌వంత‌మైన భూమికి క‌ష్ట‌ప‌డే రైతు అవ‌స‌రం ఉంది. ఐటీ కొలువులో సంపాదించే కంటే 2 ఎక‌రాల భూమిలోనే ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉంది. రైతుల‌కు సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. పండించిన పంట‌ల‌కు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఎగుమ‌తి చేసేందుకు ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాలి అని సీఎం సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement