త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

P

Telangana | Published On Jun 30, 2026, 4.10 pm IST

CM Revanth Reddy | అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం, వర్చువల్ విధానంలో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ మిష‌న్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సీఎం కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీఎస్‌టీపీసీ) చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలకు విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను కోరారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున రుణాలు అందించాలని సూచించారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, వారిపై బ్యాంకులు మరింత విశ్వాసం ఉంచి ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

Advertisement
Advertisement