MLA Madhavaram Krishna Rao | హైదరాబాద్‌ను అమ్మేసే కుట్ర జరుగుతుంది : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
MLA Madhavaram Krishna Rao | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అమ్మేసే కుట్ర జరుగుతుందని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ట్రక్ పార్కు భూముల వేలాన్ని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
MLA Madhavaram Krishna Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అమ్మేసే కుట్ర జరుగుతుందని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ట్రక్ పార్కు భూముల వేలాన్ని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హుడా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.
ట్రక్ పార్క్ కోసం రైతులు , దళితులు పొలాలు ఇచ్చారు. 2005లో ట్రక్ పార్క్ భూములను రాజశేఖర్ రెడ్డి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల నేతలు ఆందోళనతో విరమించుకున్నారు. ట్రక్ పార్క్ భూముల్లో ఐదు వందల ట్రక్‌లు పార్క్ చేస్తారు. ట్రక్ పార్క్ భూములను అమ్మితే పార్కింగ్ చేసుకునేందుకు స్థలం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేశారు. నా కుమారుడిని కూడా అనేక ఇబ్బందులు పెట్టారు. ప్రజా ప్రయోజనాల కోసం ట్రక్ పార్క్ భూములు వినియోగించుకోవాలి. ట్రక్ పార్క్ భూముల వేలం వెంటనే ఆపాలి. ట్రక్ పార్క్ భూములు కొనుక్కున్న వారు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడిస్తే మల్కాజ్‌గిరి అక్కున చేర్చుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్‌ను అమ్మేసే కుట్ర చేస్తున్నాడు. ట్రక్ పార్క్ భూములను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kalyan Krishnamurthy | ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
- ●Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..
- ●Uttar Pradesh polls | మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
- ●Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మరణ ముప్పు 29 శాతం అధికం.. అధ్యయనంలో వెల్లడి..
- ●KTR | ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిని పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు: కేటీఆర్
- ●CM Revanth Reddy | పంచాయతీలలో పౌల్ట్రీలు.. సింగిల్ విండో విధానంలో అనుమతులు

Kalyan Krishnamurthy | ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..

Uttar Pradesh polls | మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు

Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మరణ ముప్పు 29 శాతం అధికం.. అధ్యయనంలో వెల్లడి..





