త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అన్న‌దాత సంతోషం కోసం అన్న‌గా బాధ్య‌త తీసుకున్నా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మ‌రికాసేప‌ట్లో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ కానున్నాయి. ఈనేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

S

Telangana | Published On Mar 22, 2026, 2.48 pm IST

CM Revanth Reddy | అన్న‌దాత సంతోషం కోసం అన్న‌గా బాధ్య‌త తీసుకున్నా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మ‌రికాసేప‌ట్లో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ కానున్నాయి. ఈనేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement