CM Revanth Reddy | రైతు భరోసా నిధులు రూ. 3,590 కోట్లు విడుదల.. రేపు రైతుల ఖాతాల్లో జమ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట వేదికగా.. ఈ నిధులను విడుదల చేసిన సీఎం.. సోమవారం లోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు.
45 రోజుల్లో మూడు విడతల్లో రైతు భరోసా నిధులు జమ
70 లక్షల మంది రైతులకు రూ. 9 వేల కోట్ల రైతు భరోసా
ఆర్థిక సమస్యలున్నా.. రైతులను ఆదుకుంటాం..
చివరి గింజ వరకు కొంటున్నాం.. బోనస్ ఇస్తున్నాం..
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట వేదికగా.. ఈ నిధులను విడుదల చేసిన సీఎం.. సోమవారం లోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నాం. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదని సీఎం తెలిపారు.
అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలని..
ఎద్దు ఏడ్సిన ఎవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం సుభిక్షంగా ఉండదు. ఈ నాననుడిని మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ప్రజా పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా రైతులకు సంబంధించిన ఏ సంక్షమే పథకానికి, ఉచిత కరెంట్‌కు లోటు రానివ్వకుండా, పండించిన పంటను చివరి గింజ వరకు కొంటూ, రూ. 500 బోనస్ ఇచ్చి అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలని ఈ ప్రభుత్వం తాపత్రయం పడుతుందని సీఎం పేర్కొన్నారు.
45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా
ఈనాడు ఉన్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధికి అవరోధంగా మారినప్పటికీ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి.. రైతు భరోసా నిధులు విడుదల చేశాం. 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా 70 లక్షల ఖాతాల్లో వేసి ఆనందం చూస్తాం. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



