త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. సోనియాకు రేవంత్ అంద‌జేత

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు సీఎం అందజేశారు.

S

Telangana | Published On Dec 16, 2025, 5.36 pm IST

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. సోనియాకు రేవంత్ అంద‌జేత
Advertisement

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు సీఎం అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీకి సీఎం తెలియజేశారు. ప్రజా పాలనలో గత రెండేండ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, సోనియా గాంధీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement