CM Revanth Reddy | సిరాజుద్దీన్‌కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా డీఎస్పీ జాబ్ ఇచ్చాం : సీఎం రేవంత్
CM Revanth Reddy | టీమిండియా స్టార్ బౌలర్ సిరాజుద్దీన్‌కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా అతను క్రికెట్‌లో రాణించినందుకు డీఎస్పీ జాబ్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చదువులపై ఆసక్తి లేకపోతే.. క్రీడల్లోనైనా రాణించాలని సీఎం సూచించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : టీమిండియా స్టార్ బౌలర్ సిరాజుద్దీన్‌కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా అతను క్రికెట్‌లో రాణించినందుకు డీఎస్పీ జాబ్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చదువులపై ఆసక్తి లేకపోతే.. క్రీడల్లోనైనా రాణించాలని సీఎం సూచించారు. కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ఇవాళ స్పోర్ట్ పాలసీ తీసుకొచ్చాం. క్రీడల్లో రాణించండి. క్రికెట్‌లో రాణించిన సిరాజుద్దీన్ ఇంటర్ ఫెయిల్.. అతనికి ఒకరకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు. కానీ క్రీడల్లో రాణించినందుకు గ్రూప్ 1 డీఎస్పీ జాబ్ చట్టాన్ని సవరించి ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనార్టీ అమ్మాయి.. తండ్రికి ఆర్థిక పరిస్థితి లేదు. అత్యంత వెనుకబడిన కుటుంబం. ఆమె బాక్సింగ్‌లో రాణిస్తే గ్రూప్ 1 జాబ్ ఇచ్చింది ప్రభుత్వం. దీప్తి జివాంజీ పారాఒలింపిక్స్‌లో రాణించడంతో గ్రూప్ 2 జాబ్ ఇచ్చాం. ఇలా చాలా మందికి సహాయం చేశామని సీఎం గుర్తు చేశారు.
ఒక విద్యార్థి మీద ఏడాదికి ఒక లక్షా 8 వేలు ఖర్చు
మట్టిలో మాణిక్యాలైన మీరు చదువులో రాణించండి.. లేదా క్రీడల్లో రాణించండి. మైదానాల్లో పోటీ పడండి. మీ భవిష్యత్‌కు నాది హామీ.. మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపిస్తాం. ఇంజినీరింగ్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ, 14 యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరు చేశాం. విద్యాశాఖ నా దగ్గరనే ఉంది. ఒక విద్యార్థి మీద ఏడాదికి ఒక లక్షా 8 వేలు ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మౌలిక వసతులు అందిస్తున్నప్పుడు జీవితంలో పైకి రావాలి అని సీఎం సూచించారు.
బాగా చదువుకుంటే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు
మీరు బాగా చదుకుంటే కట్నం లేని పెళ్లవుతుంది. మీరు చదువుకోకపోతే భూమి అమ్మాల్సి వస్తది. బంగారం అత్తగారింటికి ఇయ్యాల్సి వస్తది. బాగా చదువుకుంటే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. అందుకే బాగా చదువుకోండి.. ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాల సహకరిస్తాం. జిల్లాలో ఉండే సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం. మనల్ని ఎవరో దత్తత తీసుకోవడం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలమూరు బిడ్డలు దతత్త తీసుకుని అభివృద్ధి వైపు నడిపిస్తారని పరిపాలన చేస్తారని చూపిద్దాం.. తట్టపని, పారపని, మట్టిపనికే కాదు పరిపాలను చేయడానికి ఆరితేరిన వారు ఉన్నారని నిరూపించుకుందామని తెలియజేస్తున్నా అని పేర్కొంటూ సీఎం తన ప్రసంగానికి ముగించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | చిన్నారెడ్డిని గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్
జులై 15, 2026

Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను సాకుగా చూపకండి సీఎం రేవంత్ : మాజీ ఎంపీ వినోద్
జులై 15, 2026

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026
తాజావార్తలు
- ●Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?
- ●CM Revanth Reddy | చిన్నారెడ్డి గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్
- ●Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్
- ●MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు
- ●Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
- ●Mahabubnagar Journalists Boycott | మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ

Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?

CM Revanth Reddy | చిన్నారెడ్డి గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్

Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్

MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు



