Revanth Reddy | అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి.. ప్రారంభించిన సీఎం రేవంత్
Revanth Reddy | అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి (Legislative Council) భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి (Legislative Council) భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, దామోదర్ రాజనర్సింహా, జూపల్లి కృష్ణా రావు, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ అధికారులు హాజరయ్యారు.
సరికొత్తగా పాత అసెంబ్లీ..
హైదరాబాద్ నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ (Town Hall) భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తయింది. వందేండ్లు పూర్తయినప్పటికీ ఈ చారిత్రక భవనం నేటికీ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్నది. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత దీనిని ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేండ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. ఈ సందర్భంగా భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్‌ను తరలించే సమయంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి.
అప్పటి నుంచి సరైన సంరక్షణ లేకపోవడంతో భవనం పైకప్పు బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. దీంతో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి రూ.30 కోట్లతో ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తయ్యాయి. వందలాది మంది కార్మికులు ఇందులో పాలుపంచుకున్నారు.
తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ నుంచి 52వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.. వెల్లడించిన ఎంఈఏ..
ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ఎగసిపడిన మంటలు
రాష్ట్రపతి పదవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: సీఎం మమతా బెనర్జీ
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



