CM Revanth Reddy | ఆ రేంజ్‌లో ప్రిపేర్ కావాలి.. వైద్యారోగ్య శాఖ మంత్రికి సీఎం చురక
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద సబ్జెక్టు.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే గానీ అర్థం కాదు.. సదరు మంత్రి కూడా ఆ రేంజ్‌లో ప్రిపేర్ కావాలని పేర్కొంటూ వైద్యారోగ్య శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద సబ్జెక్టు.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే గానీ అర్థం కాదు.. సదరు మంత్రి కూడా ఆ రేంజ్‌లో ప్రిపేర్ కావాలని పేర్కొంటూ వైద్యారోగ్య శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దామోదర రాజనర్సింహ సోషల్ డాక్టర్. పేదవాడికి ఏం సమస్య వస్తది.. ఏం వైద్యం అందించాలి అనే దానిపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని చెప్పాను. మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఆషామాషీగా అర్థమయ్యేది కాదు. అర్థమైన కూడా ఏదో విధంగా కొత్త ఛాలెంజ్ వస్తది. గతంలో గత్తర, మలేరియా రకరకాల జబ్బులు వచ్చాయి. సడెన్‌గా కొవిడ్ వచ్చింది. సమాజంలో రకరకాల జబ్బులు ఎలా వస్తున్నాయో ఎవరికి తెలియదు. ఎప్పటికప్పుడు ఈ ఛాలెంజ్‌ను మంత్రులు, అధికారులు నేర్చుకోవాలి. ఐటీ, పరిశ్రమల కంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది ఛాలెంజ్. మిగతా ఇష్యూ కంటే ఇది ఒక ఛాలెంజ్ అని సీఎం అన్నారు.
ఈ ఛాలెంజ్‌ను ఎప్పటికప్పుడు చదవితే తప్ప ఐఏఎస్‌కు ప్రిపేర్ అయినట్టు.. మంత్రి ఆ రేంజ్‌లో ప్రిపేరయి.. అర్థం చేసుకుంటే తప్ప మనం పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఆ శాఖను నిర్వహిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్‌లో సంస్కరణలు తీసుకువస్తాం. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, పేదల వైద్యం. ఈరెండింటి మీద ఫోకస్ పెట్టాం. ఒకప్పుడు భోజనానికి ఇబ్బంది ఉండేది. ఇవాళ భోజనం వచ్చింది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది కానీ స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. అందుకే నాణ్యమైన భోజనం, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



