త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 20 నిమిషాలు గాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన విమానం.. సీఎం రేవంత్​ రెడ్డికి తప్పిన ప్రమాదం

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న ఇండిగో విమానం (Indigo Flight) 20 నిమిషాల‌పాటు గాల్లో చ‌క్క‌ర్లు కొట్టింది.

G

Telangana | Published On Jul 30, 2026, 9.23 am IST

Revanth Reddy | 20 నిమిషాలు గాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన విమానం.. సీఎం రేవంత్​ రెడ్డికి తప్పిన ప్రమాదం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న ఇండిగో విమానం (Indigo Flight) 20 నిమిషాల‌పాటు గాల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు అనుమ‌తి రాక‌పోవ‌డంతో.. ర‌న్‌వేపై దిగుతున్న స‌మ‌యంలో విమానాన్ని పైల‌ట్ మ‌ళ్లీ టేకాఫ్ తీస‌కున్నారు. అయితే 20 నిమిషాల త‌రువాత సేఫ్‌గా ల్యాండ్ అవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకున్న సీఎం రేవంత్ ఇండిగో విమానంలో (6e717) బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప‌య‌ణ‌మ‌య్యారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) చేరుకుంది. క్లియ‌రెన్స్ లేక‌పోవ‌డంతో ల్యాండింగ్‌ అవుతుండగా పైల‌ట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నారు. దీంతో 20 నిమిషాల‌పాటు గాలిలోనే చ‌క్క‌ర్లు కొట్టింది. చివ‌ర‌కు రాత్రి 8.35 గంట‌ల స‌మ‌యంలో అనుమ‌తి ల‌భించ‌డంతో విమానం ఎయిర్‌పోర్టులో సుర‌క్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉంన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement