Revanth Reddy | గ్రీన్ చానల్‌లో నిధులిస్తున్నా.. పనులు ఎందుకు వేగంగా జరగడంలే?.. వరంగల్ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ అసంతృప్తి
Revanth Reddy | వరంగల్ దవాఖానలో (Warangal Super Speciality Hospital) వీలైనంత త్వరగా ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులకు సూచించారు. హాస్పిటల్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: వరంగల్ దవాఖానలో (Warangal Super Speciality Hospital) వీలైనంత త్వరగా ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులకు సూచించారు. హాస్పిటల్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్ చానల్‌లో నిధులు ఇస్తున్నా పనులు వేగంగా ఎందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
వచ్చే 30 రోజుల్లో 24 గంటలపాటు పనులు జరగాలని, వర్క్ షెడ్యూల్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సీఎంవో (CMO) అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో సమీక్ష చేయాలన్నారు. ప్రత్యేక అధికారులను నియమించి పనులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని చెప్పారు. ఇక నుంచి కలెక్టర్ ప్రతిరోజు హాస్పిటల్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. సనత్‌నగర్ టిమ్స్ (Sanath Nagar TIMS) తరహాలోనే వరంగల్‌లోనూ త్వరలో ఓపి సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దవాఖాన చుట్టూ మంచి వాతావరణం ఉండేలా పరిసరాల్ని తీర్చి దిద్దాలని ఆదేశించారు. ఇక సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. టిమ్స్ మెయింటెన్స్‌ను ఏజెన్సీకి అప్పగించాలని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల చిన్నారి మృతి
- ●Khairatabad Ganesh | భక్తులకు అలర్ట్.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
- ●తెలంగాణలో "మిని" సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!
- ●Horoscope | సెప్టెంబర్ 22 రాశిఫలాలు.. లాభాలు ఉంటాయి, కానీ గొడవల తర్వాతే!
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల చిన్నారి మృతి

Khairatabad Ganesh | భక్తులకు అలర్ట్.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం

తెలంగాణలో "మిని" సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!

Horoscope | సెప్టెంబర్ 22 రాశిఫలాలు.. లాభాలు ఉంటాయి, కానీ గొడవల తర్వాతే!





