Revanth Reddy | వర్షాభావ పరిస్థితులు..పంటల మార్పిడి చేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన
Revanth Reddy | ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్తితులు ఏర్పడే అవకాశం ఉందని, తక్కువ నీటితో పండే పంటలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతులకు సూచించారు. వాతావరణ అనుకూల పంటలు వేస్తూ, పంటల మార్పిడిని (Crop Diversification) చేపట్టాలన్నారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్తితులు ఏర్పడే అవకాశం ఉందని, తక్కువ నీటితో పండే పంటలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతులకు సూచించారు. వాతావరణ అనుకూల పంటలు వేస్తూ, పంటల మార్పిడిని (Crop Diversification) చేపట్టాలన్నారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండే పత్తి, కందులు, మిరప, వేరుశనగ వంటి వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు.
ఎక్కువ నీరు అవసరమయ్యే వరి కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని చెప్పారు. వాతావరణ మార్పులను తట్టుకునే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాల నుంచి బయటపడవచ్చన్నారు. వరి పండించే ప్రాంతాల్లో జూలై 15 వరకు తగినంత వర్షపాతం లేకపోతే, 125 రోజుల లోపు పంట కాలం పూర్తయ్యే స్వల్పకాలిక వరి ఉత్పత్తులను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులంతా వర్షాల పరిస్థితిని గమనిస్తూ, వ్యవసాయ శాఖ అందించే సూచనలను పాటించాలని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణలో వాతావరణ అనుకూల పంటలు వేస్తూ, పంటల మార్పిడిని చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు రైతులకు సూచించారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండే పత్తి, కందులు, మిరప, వేరుశనగ వంటి వాణిజ్య పంటల వైపు రైతులు… pic.twitter.com/tlukkcZ12t
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) June 6, 2026
తాజావార్తలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్
- ●Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●One Nation One Election | 2029లో జమిలి సాధ్యమే.. రాష్ట్రాలదే తుది నిర్ణయం : జేపీసీ చైర్మన్
- ●Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..

BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం

One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు





