RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరుగుతున్న హత్యల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ రెడ్డి సీఎంగా, హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరుగుతున్న హత్యల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో లా లేదు, ఆర్డర్ లేదు, శాంతి లేదు, భద్రత కూడా లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన శ్రవణ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.
పోలీసులు 40 నిమిషాల వరకు రాలేదు..
గంజాయి తాగిన కొందరు వ్యక్తులు శ్రవణ్‌ను చంపే ప్రమాదం ఉందని తెలిసీ.. అతని కుటుంబ సభ్యులు ఆ రోజు రాత్రి 11.28 గంటలకు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు 40 నిమిషాల వరకు రాలేదు అని బాధితులు తెలిపారు. This is serious breach of first responder protocol. అంతేకాకుండా నిందితులంతా గతంలో మర్డర్, హత్యాయత్నం కేసుల కింద జైలుకు వెళ్లి వచ్చినవారే. వారి మీద ఎలాంటి నిఘా లేదని అర్ధం అవుతున్నదని ఆర్ఎస్పీ తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో ఏం జరుగుతున్నది?
నాలుగు రోజుల క్రితం నిందితుల దగ్గరికి ఎక్సైజ్ పోలీసులు వచ్చి, వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి, వాళ్ల దగ్గర దొరికిన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులకు తెలవదు. ఎక్సైజ్ ఏం చేస్తుందో అది సివిల్ పోలీసులకు తెలవడం లేదు. మరి వందల కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో ఏం జరుగుతున్నది? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
తెలంగాణలో హత్యలు నేరాలు పెరుగుతున్నాయి..
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యతనిచ్చి కోట్లాది రూపాయల ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ను నిర్మించి, పోలీసులు అందరికీ పెట్రోలింగ్ వాహనాలు ఇచ్చి, షీ టీమ్స్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తానే హోం మంత్రిగా ఉంటూ పోలీసు యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణలో హత్యలు నేరాలు పెరుగుతున్నాయి. పైగా పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడానికి వాడుతున్నారు. ఇటీవలే డీజీపీ ఆఫీసుకు కేవలం కిలోమీటర్ దూరంలో ఒక అడ్వకేట్‌ను దారుణంగా వాహనంతో గుద్ధి చంపారు. కరీంనగర్‌లో పీఎంజే జువెల్లరీ షాపులో తుపాకులతో వచ్చి అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపి మరి దోచుకొని వెళ్లడం జరిగింది ఇప్పటివరకు నిందితులు దొరకలేదు అని ఆర్ఎస్పీ తెలిపారు.
బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలి..
గతంలో సుమారు 10 నుండి 12 లక్షల సీసీటీవీ కెమెరాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఈరోజు మాత్రం గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్న యువతకు భయపడి కాలనీవాసులే ఇంటింటికి సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. వెంటనే దీనిపై రాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టి, బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకొని నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించి, తిరిగి వాళ్ళు జైలు నుండి బయటకు రాకుండా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
జూన్ 5, 2026

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జూన్ 5, 2026

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Urban Forest India | కాంక్రీట్ జంగల్లో 'పాకెట్ ఫారెస్ట్'.. 100 చదరపు అడుగుల స్థలంలో మీ ఇంట్లోనూ అడవిని సృష్టించొచ్చు!
- ●Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'
- ●HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు

Urban Forest India | కాంక్రీట్ జంగల్లో 'పాకెట్ ఫారెస్ట్'.. 100 చదరపు అడుగుల స్థలంలో మీ ఇంట్లోనూ అడవిని సృష్టించొచ్చు!

Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'

HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు



