త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | హైద‌రాబాద్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉండండి.. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులతో సీఎం రేవంత్

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటన కొనసాగుతున్న‌ది. హార్వ‌ర్డ్ విద్యార్థిగా మారిన ముఖ్య‌మంత్రి.. చురుకుగా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతున్నారు. కాగా, అక్క‌డి భార‌తీయ విద్యార్థుల‌ ఆహ్వానం మేరకు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు (HBS) వెళ్లిన సీఎం.. స్టూడెంట్స్‌తో వివిధ అంశాలపై చర్చించారు.

G

Telangana | Published On Jan 29, 2026, 12.30 pm IST

Revanth Reddy | హైద‌రాబాద్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉండండి.. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులతో సీఎం రేవంత్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటన కొనసాగుతున్న‌ది. హార్వ‌ర్డ్ విద్యార్థిగా మారిన ముఖ్య‌మంత్రి.. చురుకుగా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతున్నారు. కాగా, అక్క‌డి భార‌తీయ విద్యార్థుల‌ ఆహ్వానం మేరకు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు (HBS) వెళ్లిన సీఎం.. స్టూడెంట్స్‌తో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్‌లో (Telangana Rising) భాగస్వాములు కావాలని విద్యార్థుల‌ను కోరారు. హైదరాబాద్‌ ఇమేజ్‌ను చాటే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉండాలన్నారు.

విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను వారికి వివరించారు. విజయం అనేది అదృష్టం వల్ల రాదని.. నిరంతర కృషి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని విద్యార్థుల‌కు చెప్పారు. కెరియర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎలా అధిగమించాలో తెలియ‌జేశారు.

విజన్ తెలంగాణను ప్రపంచ ప‌టంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా అన్నిరంగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నామో వారికి వివ‌రించారు. హార్వర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు.. అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, తెలంగాణలో అవకాశాలు, బలాలను గురించి ప్రపంచానికి వివ‌రించాల‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement