CM Revanth Reddy Vikarabad Visit | సోమవారం వికారాబాద్‌కు సీఎం రేవంత్, రాహుల్ గాంధీ: టూర్ షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రేపు వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో పర్యటించనున్నారు. ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వారు హాజరుకానున్నారు.
Rangareddy | Published On Mar 1, 2026, 10.47 pm IST
సంక్షిప్త సారాంశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి అనంతగిరి హిల్స్‌లో జరిగే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇరువురు నేతలు వికారాబాద్ చేరుకోనున్నారు.
CM Revanth Reddy Vikarabad Visit | తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం, మార్చి 2, 2026న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ వేదికగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల పర్యటన షెడ్యూల్ ఇదే
ఉదయం 8.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి రోడ్డు మార్గాన శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) బయలుదేరుతారు. ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలుకుతారు. ఉదయం 9.40 గంటలకు ఇద్దరు నేతలు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు పయనం అవుతారు. ఉదయం 10.00 గంటలకు వికారాబాద్‌లోని ఎస్ఏపీ (SAP) ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి ఉదయం 10.15 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి అనంతగిరి హిల్స్‌లోని హరిత వ్యాలీ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.20 గంటలకు తిరిగి హరిత రిసార్ట్స్ నుంచి బయలుదేరి ఎస్ఏపీ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి పయనమై, 4.50 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రికి 'జెడ్ ప్లస్' (Z Plus) కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో, పోలీసు యంత్రాంగం, జిల్లా అధికారులు వికారాబాద్‌లో పటిష్ట బందోబస్తు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



