Road Accident | అర్వపల్లి వద్ద పల్టీలు కొట్టిన కారు.. ఉపాధ్యాయురాలు దుర్మరణం
Road Accident | సూర్యాపేట జిల్లా అర్వపల్లి (Arvapally) వద్ద ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులతో వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
త్రినేత్ర.న్యూస్: సూర్యాపేట జిల్లా అర్వపల్లి (Arvapally) వద్ద ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులతో వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాతి సెలవులు ముగియడంతో నల్లగొండ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు (Government Teachers) కారులో పాఠశాలకు వెళ్తున్నారు. వారిలో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి వద్ద ఒక్కసారిగా కారు టైరు పేలిపోయింది. అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు హెడ్మాస్టర్లు పోరెడ్డి గీత (రావులపల్లి స్కూల్ ప్రిన్సిపల్), తులసి, మరో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
సంబంధిత వార్తలు

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
జులై 8, 2026

Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..
జులై 8, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం



