త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు రండి.. కేసీఆర్‌కు ఆహ్వానం

KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వ‌గ్రామం చింత‌మ‌డ‌క‌లో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. 25న శ్రీ ప‌ట్టాభి సీతారామ‌చంద్ర స్వామి నూత‌న ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న‌, 27న శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లను నిర్వ‌హించ‌నున్నారు.

S

Telangana | Published On Mar 20, 2026, 5.52 pm IST

KCR | శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు రండి.. కేసీఆర్‌కు ఆహ్వానం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వ‌గ్రామం చింత‌మ‌డ‌క‌లో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. 25న శ్రీ ప‌ట్టాభి సీతారామ‌చంద్ర స్వామి నూత‌న ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న‌, 27న శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు హాజ‌రు కావాల‌ని కేసీఆర్‌ను ఆల‌య క‌మిటీ ఆహ్వానించింది. ఈ మేర‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను క‌ల్వ‌కుంట్ల వంశీధ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో ఆల‌య క‌మిటీ ప్ర‌తినిదులు ఆకుల రామ‌గౌడ్‌, పెండ‌ల గ‌ణేశ్‌, బైరి న‌ర్సింహారెడ్డి, వాతం శివ‌, ప‌డ‌కండి విశ్వ‌నాథం, ఎల్ల‌ప్ప‌గారి పోచయ్య త‌దిత‌రులు క‌లిశారు. ఎర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో కేసీఆర్‌ను క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement